Mayasabha Trailer:మయసభ (Mayasabha).. ఆది పినిశెట్టి (Aadhi Pini Shetty), చైతన్య రావు మాదాడి( Chaitanya Rao madadi) కాంబినేషన్లో వస్తున్న వెబ్ సిరీస్ మయసభ (Mayasabha) . ప్రముఖ డైరెక్టర్ దేవా కట్ట (Deva katta) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల జీవితాల నుండి ప్రేరణ పొందిన ఒక కల్పిత రాజకీయ నాటకం అని చెప్పవచ్చు. ఆగస్టు 7వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ లో ప్రసారం కానుంది. శత్రువులు.. మిత్రులుగా మారితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించగా.. ఈ ఈవెంట్ వేదికగా ట్రైలర్ ను లాంచ్ చేశారు మేకర్స్. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది..? ఆడియన్స్ ను మెప్పించిందా ? లేదా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
రాజకీయ శత్రువులు.. మిత్రులు అయితే..?
ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి చంద్రబాబునాయుడు గా క్రిష్ణమ నాయుడు పాత్రలో నటిస్తున్నారు. అలాగే చైతన్యారావ్ Ms రామిరెడ్డి గా వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర పోషిస్తున్నారు. అలాగే హీరో సాయికుమార్ (Sai Kumar) దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) పాత్ర పోషిస్తున్నట్లు ట్రైలర్ లో రివీల్ చేసారు. అయితే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ పాత్ర పేరు ఏంటి అన్నది చూపించలేదు. వాస్తవానికి రాజకీయాలలోకి రాకముందు ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి మిత్రులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వారే పలుమార్లు ప్రస్తావించారు కూడా. ఇక వీరిద్దరి పొలిటికల్ కెరీర్ కి ముందు, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే కథాంశం తోనే ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
మయసభ ట్రైలర్ ఎలా ఉందంటే..?
ఇక ప్రస్తుతం అంచనాలు పెంచుతూ రిలీజ్ అయిన ఈ ట్రైలర్.. అందరిలో వెబ్ సిరీస్ పై క్యూరియాసిటీని పెంచేసింది.ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే.. ఒక బస్సు ప్రయాణిస్తున్నట్టు చూపిస్తారు. డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయగానే ఎదురుగా ఒక వేడుక నుంచి తిరిగి వస్తున్న వెహికల్ కి యాక్సిడెంట్ అయి ఉంటుంది. అందులో చాలామంది గాయాలతో సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో ఒక వ్యక్తి.. కమ్యూనిస్టు లీడర్ చనిపోయారని, రాజంపేట వరకు తీసుకెళ్లాలని ఆ బస్సులో ఉన్న వారిని వేడుకుంటాడు. ఇక అదే బస్సులోనే ఆది పినిశెట్టి, చైతన్య రావు ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. తర్వాత అటు రాజశేఖరరెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు జీవిత కెరియర్లో జరిగిన మలుపులను, రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఇందులో చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
?utm_source=ig_web_copy_link
ALSO READ: Vijay Sethupathi: క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై హీరో క్లారిటీ.. ఏమన్నారో తెలుసా?