BigTV English

Viral Video: పావురాలతో భయం.. బుక్కైన యువకులు, వైరల్ వీడియో

Viral Video: పావురాలతో భయం.. బుక్కైన యువకులు, వైరల్ వీడియో

Viral Video: టెక్ యుగంలో డబ్బులు సంపాదించడానికి యువత వేర్వేరు మార్గాలు ఎంచుకుంటున్నారు. కాకపోతే పైన కనిపిస్తున్న వ్యక్తులు ఆ రకం కాదు. ప్రజల్లో భయాందోళనను క్రియేట్ చేయాలని చూశారు. చివరకు పోలీసుల దృష్టిలో పడ్డారు, అడ్డంగా బుక్కయ్యారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..


మంత్రాలకు చింతకాయలు రాలవు.. కానీ ఇద్దరు యువకులు ఆ గ్రామ ప్రజలను నమ్మించి, భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కొంతమేరా సక్సెస్ అయ్యారు. అనుకోని పరిస్థితుల్లో పోలీసులకు దొరికిపోయారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో వింత కుట్ర బయటపడింది. కాకరోలి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పావురాళ్లతో స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి ప్లాన్ చేశారు షోయబ్-షకీబ్మ్ అనే ఇద్దరు వ్యక్తులు. పావురాల కాళ్ళకు- మెడకు LED లైట్లను కట్టి వాటిని చీకటిలో ఎగురేసేవారు.


తద్వారా ఆకాశంలో మెరుస్తున్న లైట్లను సీక్రెట్ డ్రోన్లుగా చూపెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. రాత్రివేళ ఎరుపు, ఆకుపచ్చ లైట్లతో కొన్ని డ్రోన్‌లు రాత్రి వేళ ఆకాశంలో ఎగురుతున్నట్లు పుకారు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయా గ్రామాల్లో ప్రజలు భయపడ్డారు. చీకటి పడితేచాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడేవారు.

ALSO READ: చైనాలో రోడ్లపైకి జనాలు.. 20 కేజీల బంగారు కోసం వెతుకులాట

వారి భద్రత కోసం కాపలాదారులను నియమించుకున్నారు. రాత్రి సమయంలో ఆకాశంలో ఎరుపు-ఆకుపచ్చ లైట్లు మెరుస్తున్నట్లు కనిపిస్తోందని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వాటిని గమనించడం మొదలుపెట్టారు. మెరుస్తున్న లైట్లను గమనించి వెంబడించారు.  ఆ లైట్ల పావురాలు పొలాలు, అటవీ ప్రాంతం వైపు కదులుతున్నట్లు గుర్తించారు.

అప్పటికే పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఆ లైట్లు.. డ్రోన్ల నుంచి కాదని పావురం నుండి వస్తోందని నిర్థారించారు. ఎవరు వీటిని ఎగుర వేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. ఆ గ్రామానికి వచ్చిన పోలీసులు సీక్రెట్‌గా పావురాళ్ల డ్రోన్ల గురించి గమనించడం మొదలుపెట్టారు.

ఇద్దరు యువకులు పావురాలను ఎగుర వేసే క్రమంలో అదుపులోకి తీసుకున్నారు. పావురాల కాళ్ళు, మెడలకు LED లైట్లు కట్టి ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా పావురాలను ఎగురవేసినట్టు చెప్పారు. ప్రజలను కావాలనే భయపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన సామగ్రిని ఢిల్లీ నుండి తెప్పించారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.

 

Related News

Baba Vanga Prediction: ఏంటి.. AI వల్ల అలా జరుగుతుందా? భయపెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం!

Noida Man: తల్లి మరణం.. 20 ఏళ్ల యువకుడి ఖాతాలోకి రూ.10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299..

Viral Video: ఇంగ్లండ్ లోనూ ఉమ్మేస్తున్నారు.. ఈ ఖైనీ బ్యాచ్ మారరు!

Biggest Banana: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?

TCS Employee: ఐటీ ఉద్యోగి రోడ్డుపై నిద్ర.. టీసీఎస్ స్పందన ఇదే

Self Surgery: మత్తు లేకుండా.. కడుపు కోసుకుని.. తనకి తానే సర్జరీ చేసుకున్న ఈ డాక్టర్ గురించి తెలుసా?

Big Stories

×