E-Paper
Advertisement

OTP అవసరం లేదు… కాల్ చేయక్కర్లేదు.. ‘No’ అని టైప్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

OTP అవసరం లేదు… కాల్ చేయక్కర్లేదు.. ‘No’ అని టైప్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!
Advertisement

WhatsApp Scam: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓటీపీ (OTP) చెప్పకపోయినా, పిన్ నంబర్ నమోదు చేయకపోయినా బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ము గాల్లో కలిసిపోతోంది. కేవలం వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి ‘No’ అని సమాధానం ఇస్తే చాలు… ఖాతా ఖాళీ అయిపోతోంది. తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ కొత్త రకం సైబర్ మోసం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

‘నో’ అని బదులిస్తే అంతే సంగతులు!

హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి ఒక అపరిచిత వాట్సాప్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో ‘మీ బ్యాంక్ ఖాతా నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కట్ అయ్యాయి’ అని రాసి ఉంది. అది చూసి సదరు వ్యక్తి కంగారు పడేలోపే సదరు నంబర్ నుండి వెంటనే మరొక మెసేజ్ వచ్చింది. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే, వెంటనే ‘No’ అని రిప్లై ఇవ్వండి’ అని అందులో పేర్కొన్నారు. ఖాతాలో డబ్బులు పోయాయేమోనన్న కంగారులో, భయాందోళనకు గురైన ఆ బాధితుడు ఏమాత్రం ఆలోచించకుండా ‘No’ అని టైప్ చేసి రిప్లై ఇచ్చాడు. దీంతో క్షణాల్లో అతడి బ్యాంక్ ఖాతా నుండి లక్షల రూపాయలు మాయమయ్యాయి.

ఫోన్ మొత్తం సైబర్ కేటుగాళ్ల గుప్పిట్లోకి…

Advertisement

ఈ కొత్త తరహా మోసం వెనుక పెద్ద సాంకేతిక కుట్ర దాగి ఉందని పోలీసులు వెల్లడించారు. మనం పంపే ఆ ఒక్క ‘No’ రిప్లై ద్వారా ఆ మెసేజ్‌లో నేరగాళ్లు ముందుగానే సెట్ చేసి ఉంచిన హిడెన్ (రహస్య) లింకులు లేదా మాల్వేర్‌లు యాక్టివేట్ అవుతాయని పేర్కొన్నారు. దీనివల్ల హ్యాకర్లు మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణ సాధించి.. అందులోని బ్యాంకింగ్ యాప్‌లు, SMSల సమాచారాన్ని దొంగిలించి క్షణాల్లో ఖాతాల నుండి సొమ్మును కాజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: సంక్రాంతి తప్ప వేరే డేట్ కనిపించలేదా? మెగా హీరో సినిమాకు బెదిరింపు ఫోన్ కాల్స్?

జాగ్రత్త పడకపోతే ప్రమాదమే!

Advertisement

ఈ వినూత్న సైబర్ క్రైమ్ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్పందించారు. ప్రజలు ఇటువంటి మోసపూరిత సందేశాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అపరిచిత నంబర్ల నుండి బ్యాంక్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి వచ్చే మెసేజ్‌లను చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పడకూడదని, వాటికి ఎలాంటి రిప్లై ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా బ్యాంక్ అధికారిక కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి తప్ప, ఇలాంటి సందేశాలకు స్పందించి ఆర్థికంగా నష్టపోవద్దని హితవు పలికారు.

Also Read: జియో సరికొత్త ప్లాన్.. రూ.450కే ఫ్రీ కాల్స్, అపరిమిత 5G.. ఇంకా ఎగిరిగంతేసే బెనిఫిట్స్!

Tags

Related News

ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!

65 ఇంచుల టీవీపై 66 % డిస్కౌంట్..ఎన్నడూ లేని ఆఫర్

ఇక మీ చాట్‌జీపీటీ డేటా సేఫ్..ఫేస్ ఐడీ, పిన్ లాక్ ఫీచర్ వచ్చేసింది!

గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతుకుతున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం!

జియో సరికొత్త ప్లాన్.. రూ.450కే ఫ్రీ కాల్స్, అపరిమిత 5G.. ఇంకా ఎగిరిగంతేసే బెనిఫిట్స్!

సేల్‌లో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్,వెంటనే కొనేయండి

డార్క్ వెబ్‌లో SBI కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్.. అకౌంట్లు సురక్షితమేనా?

Big Stories

Advertisement
×