E-Paper
Advertisement

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?
Advertisement

Youtuber Nandana: నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన వారిలో యూట్యూబర్ నందన(Nandana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా ఈమె పట్ల స్కాం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నందు తన భర్త మధుతో కలిసి ఉద్యోగాలు పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు రావడంతో ఈమె గత కొంతకాలంగా తన భర్త మధుతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక వీరికి డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేయటంతో వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు నందన..

ఇన్ని రోజులు పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి నందన తాజాగా అమెరికా నుంచి ఎమిరేట్స్ ఈకే -526 విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఈమె పాస్ పోర్ట్ తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు ఆమెపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న విషయాన్ని గుర్తించి వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం పోలీసులు నందనను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఈమెను పోలీసులు అరెస్టు చేయడంతో తాజాగా విచారణ కోసం తన లాయర్ తో కలిసి విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్(ibrahimpatnam) కి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో స్కాం..

Advertisement

నందన తన భర్తతో కలిసి “డెస్టినీ కన్సల్టెన్సీ” అనే ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేశారు. విదేశాలలో మంచి ఉద్యోగులు ఇప్పిస్తామని, వీసాలు చేయిస్తాము అంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి ఈమె డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారుగా ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారని తెలుస్తోంది. ఇలా వీరిపై ఏపీలో పలు ప్రాంతాలలో కేసు నమోదు కావడంతో ఈమెపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఇన్ని రోజులు తన భర్త మధుతో కలిసి అజ్ఞాతంలో ఉన్న ఈమె ఉన్నఫలంగా ఇండియా రావడానికి గల కారణమేంటంటూ కూడా ఆరా తీస్తున్నారు.

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం..

ఈ స్కామ్ లో భాగంగా అజ్ఞాతంలో ఉన్న నందన ఉన్నఫలంగా ఇండియా రావడానికి కారణం బిగ్ బాస్ 10 (Big Boss 10)తెలుగు అని తెలుస్తుంది. ఈ కార్యక్రమం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. ఇక వైల్డ్ కార్డు ద్వారా మరికొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నందన కూడా వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ 10 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం ఈమె ఇండియా వచ్చారని తెలుస్తుంది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చి ఈమె అడ్డంగా దొరికిపోయారు. మరి నందన వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

Related News

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×