E-Paper
Advertisement

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!
Advertisement

Huawei Mate XT 2 Ultimate Design: ఫోన్ టెక్నాలజీలో హువావే కంపెనీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని మరోసారి నిరూపించింది. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్లతో మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ చైనా దిగ్గజం.. ఇప్పుడు ఏకంగా మూడు మడతలు పడే సరికొత్త ఫోన్‌ను మనముందుకు తీసుకువచ్చింది. Huawei Mate XT 2 Ultimate Design పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. సాధారణంగా మడతపెట్టే ఫోన్లలో స్క్రీన్ మధ్యలో గీతలు పడటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఫోన్‌లో ఆ సమస్యే లేకుండా చాలా స్మూత్‌గా ఉండటం దీని ప్రత్యేకత.

ఈ Huawei Mate XT 2లో ప్రధాన ఆకర్షణ దీని ట్రై-ఫోల్డ్ డిజైన్. రెండు వైపులా వింగ్‌లా తెరుచుకునే విధంగా ఫోన్‌ను రూపొందించారు. సాధారణ ఫోల్డబుల్ ఫోన్లలో కనిపించే స్క్రీన్ క్రీజ్ సమస్యను తగ్గించేలా అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. కవర్‌పై జెర్గువాన్ కున్లూన్ గ్లాస్, మెయిన్ డిస్‌ప్లేకు యూటీజీ గ్లాస్, కార్బన్ ఫైబర్ ప్రొటెక్షన్ అందించారు. IP58, IP59 రేటింగ్‌లు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

పనితీరు కోసం ఇందులో కిరిన్ 9050 ప్రాసెసర్‌ను అందించారు. గత మోడల్‌తో పోలిస్తే.. సుమారు 42 శాతం వేగంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. గేమింగ్ కోసం రియల్‌టైమ్ రే ట్రేసింగ్, ప్రైవసీ కోసం స్మార్ట్ షీల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉపయోగపడే శాటిలైట్ కమ్యూనికేషన్ సదుపాయం ఉండటం దీని ప్రత్యేక ఆకర్షణ.

Advertisement

ఫొటోగ్రఫీ కోసం True-to-Color Camera 3.0 సిస్టమ్‌ను ఇచ్చారు. ఇందులో మెయిన్ కెమెరాతో పాటు వైడ్ యాంగిల్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. మూడు మడతల డిజైన్‌తో డెస్క్-క్యాలెండర్ షూటింగ్ మోడ్‌లోనూ ఫొటోలు తీసుకోవచ్చు. ఇక HarmonyOS 7పై పనిచేసే ఈ ఫోన్‌లో ఒకేసారి మూడు విండోలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ECG అనాలిసిస్ సాఫ్ట్‌వేర్ కూడా ఇందులో ఉంది.

ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్‌కే పరిమితమైంది. దీని ప్రారంభ రూ.2.81 లక్షలు. ఫోన్‌తో పాటు స్టైలస్ సెట్ కూడా లభిస్తుంది. సెప్టెంబర్ 12 నుంచి చైనాలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో విడుదల, ధరపై హువావే ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇండియాలోకి వస్తే.. ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో ఇది మరో పెద్ద చర్చకు దారితీయడం ఖాయం.

Also Read: వాట్సప్ న్యూ ఫీచర్ అదిరింది.. ఇకపై అకౌంట్ లేకపోయినా కాల్స్ జాయిన్ అవ్వొచ్చు!

Tags

Related News

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

వాట్సప్ న్యూ ఫీచర్ అదిరింది.. ఇకపై అకౌంట్ లేకపోయినా కాల్స్ జాయిన్ అవ్వొచ్చు!

సైబర్ ఫ్రాడ్‌లో డబ్బు పోయిందా? ప్రభుత్వ పోర్టల్‌లో ఇలా రిఫండ్ కోసం అప్లై చేసుకోండి!

కారులో ఆండ్రాయిడ్ ఆటో వాడే అలవాటు ఉందా? అయితే మీ ఫోన్ బ్యాటరీ డేంజర్లో పడ్డట్టే!

అచ్చం మేకప్ బాక్స్ లాగే ఉంటుంది.. 35 క్రిస్టల్స్‌తో మోటోరోలా కొత్త రేజర్ ఫోన్ చూశారా?

ఆహా.. Viలో ఇంతటి సూపర్ ప్లాన్ ఉందా? జస్ట్ రూ.349కే అపరిమిత 5G, ఫ్రీ కాల్స్!

Big Stories

Advertisement
×