Romantic Slasher Thriller on OTT : వాలెంటైన్స్ డే దగ్గర పడిందంటే ప్రేమికులు తమ లవ్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతారు. కానీ అదే సమయంలో ఓ మాస్క్‌డ్ కిల్లర్ ప్రేమజంటలనే టార్గెట్ చేస్తూ తిరుగుతుంటే ? ఎక్కడ ప్రేమికులు కనిపిస్తే అక్కడే ప్రత్యక్షమై, వాళ్ల జీవితాలను నరకంగా మార్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? ప్రేమ, భయం, కామెడీ కలిపి సాగే క్రేజీ స్లాషర్ థ్రిల్లర్ ‘Heart Eyes’. మరి ఈ సినిమాను తెలుగులో చూడొచ్చా ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కథ ప్రేమికుల రోజుకు సంబంధించిన ఓ భయంకరమైన మిస్టరీతో మొదలవుతుంది. నగరంలో ప్రేమజంటలు ఒక్కొక్కరుగా కిల్లర్ కు టార్గెట్ అవుతుంటారు. ముఖానికి మాస్క్ వేసుకున్న ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో ఎవరికీ అర్థం కాదు. ప్రేమలో మునిగిపోయిన జంటలకు అసలు ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియక పరిస్థితులు మరింత టెన్షన్‌గా మారతాయి. ఇదే సమయంలో ఇద్దరు యువకులు అనుకోకుండా ఈ కిల్లర్ వేటలో చిక్కుకుంటారు.
ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునేలోపే ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి రావడంతో వారి మధ్య జరిగే సంభాషణలు, గందరగోళం, తప్పించుకునే ప్రయత్నాలు నవ్వులు తెప్పిస్తాయి. కానీ కిల్లర్ మాత్రం సరదాగా తీసుకునే రకం కాదు. అతని దాడుల వెనుక ఓ ప్యాటర్న్ ఉందని గుర్తించిన తర్వాత ఈ జంటకు అసలు విషయం అర్థమవుతుంది. ప్రేమికులనే ఎందుకు చంపుతున్నాడు ? అతని టార్గెట్‌కు ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా ? ఈ జంట అతని చేతికి చిక్కకుండా తప్పించుకోగలదా ? చివరికి మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో బయటపడినప్పుడు కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? అనేదే సినిమాలో చూడాల్సిన థ్రిల్.
అలా ప్రేమికులపై కన్నేసిన ఈ మిస్టరీ కిల్లర్ వరుసగా జంటలను టార్గెట్ చేస్తుంటాడు. మొదట ఇదంతా ఏదో సరదా గేమ్‌లా అనిపించినా, కిల్లర్ దాడులు పెరిగేకొద్దీ అసలు భయం మొదలవుతుంది. అదే సమయంలో ఈ హత్యల మధ్య చిక్కుకున్న ఓ యువ జంట తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు కథకు కామెడీ టచ్ ఇస్తాయి. అసలు ఈ మాస్క్‌డ్ కిల్లర్ ప్రేమికులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అతని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? కిల్లర్ కంట్లో పడిన తర్వాత ఈ జంట ఎలా తప్పించుకుంది ? అనేదే సినిమాలో అసలు ట్విస్ట్.
‘హార్ట్ ఐస్’ 2025లో వచ్చిన ఇంగ్లీష్ రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్. ప్రేమ, హారర్, సస్పెన్స్, బ్లాక్ కామెడీ కలగలిసిన ఈ మూవీ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. మాస్క్‌డ్ కిల్లర్ కథలు, స్లాషర్ సినిమాలు, భయంతో పాటు ఫన్ ఉండే ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ‘హార్ట్ ఐస్’ మంచి టైమ్‌పాస్ రైడ్‌గా అనిపించొచ్చు.