E-Paper
Advertisement

Viral Video: అరే మీరు స్నేహితులేనా? ఫ్రెండ్ బర్త్ డే కేకులో బాంబులు పెట్టి..

Viral Video: అరే మీరు స్నేహితులేనా? ఫ్రెండ్ బర్త్ డే కేకులో బాంబులు పెట్టి..
Advertisement

బర్త్ అంటే.. హ్యాపీగా గడపాలి. కేక్ కట్ చేయాలి. ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడపాలి.కానీ, కొంత మంది కుర్రాళ్లు బర్త్ డేల పేరుతో చేసే చిల్లర పనులు షాక్ కు గురి చేస్తున్నాయి. కేక్ కటింగ్ పేరుతో తమలోని పైత్యాన్ని బయట పెట్టుకుంటున్నారు. బర్త్ డే బంప్స్ అంటూ అడ్డమైన పనులు చేస్తున్నారు. రీసెంట్ గా ముంబైలో పుట్టిన రోజు పార్టీ చేస్తామని పిలిచి, బర్త్ డే బంప్స్ పేరుతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ముంబైలో కలకలం సృష్టించింది. ఈ ఘటనలో బర్త్ డే బాయ్ తీవ్రంగా గాయపడగా, ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ మర్చిపోక ముందే మరో ఘటన జరిగింది. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో కేక్ లో బాంబులు పెట్టి పేల్చారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

బర్త్ డే కేక్ లో పటాకులు పెట్టి..

గణేష్ షిండే అనే నెటిజన్ ఇన్ స్టాలో ఈ వీడియోను షేర్ చేశాడు. ఇందులో కొంత మంది ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్ బర్త్ డే రోజును క్రేజీగా ప్లాన్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా బర్త్ డే కేక్ తయారు చేయించారు.  పటాకుల చుట్టను లోపల పెట్టి, పై నుంచి కేక్ తయారు చేయించారు. రెండు స్టెప్పులలో అద్భుతమైన కేక్ రెడీ అయ్యింది. సాయంత్రం వేళ ఫ్రెండ్ ను ఇంటి నుంచి తీసుకొచ్చారు. మెడలో పూల దండ వేసి కాసేపు డ్యాన్స్ చేశారు. చివరకు కేక్ కట్ చేయాలంటూ తీసుకొచ్చారు. కేక్  మీద క్యాండిల్ అందించగానే, ఒక్కసారిగా లోపల ఉన్న పటాకులు పేలాయి. కేకు ముక్కలు ముక్కలు అయిపోయింది. వెంటనే అక్కడి నుంచి అదరూ పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్రెండ్స్ చేసిన పనికి బర్త్ బాయ్ ఒక్కసారిగా షాకయ్యాడు. కాసేపు అక్కడే ఉంటే, పుట్టిన రోజు నాడే చావు డప్పు కొట్టాల్సి వచ్చేదనుకున్నాడు.  ఫ్రెండ్స్ ను తిట్టిన తిట్టు తిట్టుకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Advertisement

Read Also: ఆ వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి చనిపోయిందా? ఇందులో నిజం ఎంత?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి పనులు చేసే వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. బర్త్ డే పేరుతో వెధవ వేషాలు వేయడం ఈ రోజుల్లో పెరిగిపోయిందంటున్నారు. భయం లేకపోవడం వల్లే ఇలాంటి పనులు జరుగుతున్నాయంటున్నారు. బర్త్ డే అంటే ప్రశాంతంగా జరుపుకోవాలే తప్ప, ఇలాంటి పైత్యం పనులు చేయకూడదంటున్నారు.

Read Also: వైద్య అధికారి చిలక్కొట్టుడు.. మహిళా బంధువుల చితక్కొట్టుడు.. నెట్టింట వీడియో వైరల్!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×