E-Paper
Advertisement

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై వరుస అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో పాగల్ పవిత్ర ఒకరు. జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా కొనసాగుతూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఈ కార్యక్రమంతో సక్సెస్ అందుకున్న పవిత్ర (Pavitra)అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె బిగ్ టీవీలో ప్రసారమవుతున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు.

కుటుంబం పట్ల బాధ్యత లేదు..

ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ వర్షా పవిత్ర కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు తాను తన తల్లి మాత్రమే ఉంటున్నామని తెలిపారు. అదేంటి నాన్న అని అడగడంతో తన తండ్రి గురించి మాట్లాడుతూ పవిత్ర కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం నాన్న ఎక్స్పైర్ అయ్యారు కానీ ఆయన ఉన్నప్పుడు కూడా నన్ను ఏమాత్రం చూసుకోలేదని తెలిపారు. మామూలుగా నాన్నకు కూతుర్లు అంటే చాలా ఇష్టమని చెప్తుంటారు అయితే వాళ్ళు చూసుకునే విధానాన్ని బట్టి మనకు కూడా ప్రేమ ఉంటుందని పవిత్ర తెలిపారు.

ఒక జత బట్టలు కూడా కొనలేదు..

Advertisement

మా నాన్న చిన్నప్పటినుంచి నాతో ఎప్పుడూ ప్రేమగా లేరు కనీసం నాకు ఒక జత బట్టలు తీసుకురాలేదు, ఎప్పుడు బయటకు తీసుకెళ్లి సరదాగా తిప్పుకొని రావడం వంటివి కూడా లేదు. ఆయన ఏదైనా పనికి వెళ్తే ఆ పనికి వచ్చిన డబ్బులతో తాగి తిని పడుకోవడం తప్ప నాన్న మా గురించి ఎప్పుడూ ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదని పవిత్ర తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. లేని నాన్న గురించి ఇలా మాట్లాడటం తప్పు కానీ చిన్నప్పటినుంచి తండ్రిగా ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదని తెలిపారు. నా చిన్నతనం అంతా నాన్న అమ్మతో గొడవ పడటమే గుర్తుంది. కనీసం తనుకొక కూతురు ఉంది తనని చూసుకోవాలని బాధ్యత ఉండేది కాదు మా స్కూల్ ముందు తాగి ఎన్నోసార్లు పడిపోయాడు నేను వెళ్లి మా అమ్మకు చెబితే మా అమ్మ ఇంకొకరి సహాయంతో వచ్చి నాన్నను తీసుకెళ్లిపోయేది నా చిన్నతనం అంత తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయానని తెలిపారు.

Advertisement

ఏదైనా సిచువేషన్ లో నాన్న లేరు అనే బాధ కలుగుతుందా అంటూ ప్రశ్న వేయడంతో ప్రతి ఇయర్ ఫాదర్స్ డే రోజు ప్రతి ఒక్కరూ వారి ఫాదర్ తో సంతోషంగా గడుపుతూ ఉంటారు ఆ టైంలో కాస్త బాధ అనిపిస్తుందని తెలిపారు. ఇలా నాన్న ప్రవర్తన చూసి బాధ్యత లేకుండా ఉండడం కంటే పిల్లల్ని కనకుండా ఉండడమే మంచిది కదా అనే భావన కూడా నాలో కలిగిందని పవిత్ర ఎమోషనల్ అయ్యారు. ఇక అమ్మ నాన్న పరిస్థితి చూడలేక తాను టీవీలో ఒక యాడ్ చూసి అమ్మతో కలిసి హైదరాబాద్ వచ్చేసానని తెలిపారు. ఇప్పటికీ ఇలాంటి బాధ్యత లేకుండా ఉండే తండ్రులను ఉద్దేశించి పవిత్ర మాట్లాడుతూ దయచేసి ఇలా ఎవరూ ఉండదని మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా పెరుగుతారని వారి ముందు చాలా పద్ధతిగా నడుచుకోండి అంటూ పవిత్ర తెలిపారు.

Also Read: సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

Related News

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

ఐబ్రోస్ నచ్చలేదని నామినేషన్ చేస్తానంటున్న రామ్ ప్రసాద్..ఇదెక్కడి గోల రా మావా!

జమీందారు వంశంలో పుట్టి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. ఎవరీ కంటెస్టెంట్?

మాధురి రాథోడ్ సూసైడ్ నోట్ లో బయటపడ్డ పేర్లు!

Big Stories

Advertisement
×