E-Paper
Advertisement

ఫాస్ట్ ఛార్జర్ పేరుతో ఈ తప్పు చేస్తున్నారా? ఫోన్‌కే కాదు.. మీకూ ప్రమాదమే!

ఫాస్ట్ ఛార్జర్ పేరుతో ఈ తప్పు చేస్తున్నారా? ఫోన్‌కే కాదు.. మీకూ ప్రమాదమే!
Advertisement

Third Party Charges: స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు దాంతో పాటు వచ్చే ఒరిజినల్ ఛార్జర్ పాడైతే.. కొత్తది కొనడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. యాపిల్, శాంం‌సంగ్ లాంటి కంపెనీల ఒరిజినల్ ఛార్జర్లు వేలల్లో ఉంటాయి. అదే రోడ్డు పక్కన షాపులోనో, ఆన్‌లైన్ సేల్స్ లోనో కేవలం రూ.100 పెట్టినా ఛార్జర్లు దొరుకుతుంటాయి. ఇవి అరగంట లోనే సగం బ్యాటరీ నింపేస్తుంటుంది కొన్నిసార్లు. కానీ ఈ చిన్న పొరపాటు ఫోన్ లైఫ్‌ను తగ్గించడమే కాకుండా.. దాని వల్ల మన ప్రాణాలు కూడా ప్రమాదంలో పడవచ్చు.

మేలు కంటే కీడే ఎక్కువ:

తక్కువ ధరకు దొరికే రోడ్డు పక్క ఛార్జర్లలో నాణ్యమైన విడిభాగాలను వాడరు. ఇవి ఫోన్‌కు ఒకే రకమైన విద్యుత్‌ను అందించలేవు. కరెంట్ పదే పదే హెచ్చుతగ్గులకు గురికావడం వల్ల ఫోన్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీ దెబ్బతింటుంది. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోయి, ఛార్జింగ్ ఎక్కువ సేపు నిలవదు. పైగా ఫోన్ మదర్‌బోర్డులోని సున్నితమైన భాగాలు కూడా కాలిపోయే ప్రమాదం ఉంది.

Advertisement

Also Read: ఇంత తక్కువ ధరకి ఇలాంటి ల్యాప్‌టాప్స్ వస్తున్నాయా? ట్రెండింగ్‌లో ఉన్న 5 మోడల్స్‌ ఇవే!

పేలిపోయే ప్రమాదం లేకపోలేదు:

మంచి కంపెనీ ఛార్జర్లలో ఫోన్, ఛార్జర్ పరస్పరం అనుసంధానించుకునే ‘పవర్ డెలివరీ’ చిప్స్ ఉంటాయి. ఫోన్ వేడెక్కినప్పుడు ఇవి ఛార్జింగ్ స్పీడ్‌ను తగ్గిస్తాయి. చౌక ఛార్జర్లలో ఇవి ఉండవు. బ్రిటన్‌లో చేసిన ఒక పరిశోధనలో చౌక ఛార్జర్లలో సగానికి పైగా పేలిపోయే అవకాశం ఉందని, కొన్నింటి వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉందని తేలింది. కొన్ని నకిలీ ఛార్జర్లు బరువుగా కనిపించడానికి లోపల క్లే లేదా బంకమట్టి నింపుతున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

క్వాలిటీ ఛార్జర్‌ ఎంచుకోవడమెలా?

Advertisement

అలా అని ఎల్లప్పుడూ ఖరీదైన ఒరిజినల్ ఛార్జర్లే కొనాల్సిన పనిలేదు. మార్కెట్లో దొరికే బాగా పాపులర్ అయిన థర్డ్ పార్టీ బ్రాండ్లను నమ్మవచ్చు. యూఎల్ లేదా ఎమ్‌ఎఫ్ఐ సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇవి కఠినమైన సేఫ్టీ టెస్టులు పాస్ అయి మార్కెట్లోకి వస్తాయి. యాంకర్, యుగ్రీన్, ఇనియు లాంటి ప్రముఖ బ్రాండ్లు సురక్షితమైన ఆప్షన్లను అందిస్తున్నాయి.

ధర కంటే క్వాలిటీ ముఖ్యం:

నేటి ఆధునిక ఛార్జర్లలో సిలికాన్‌కు బదులుగా గ్యాలియం నైట్రైడ్ టెక్నాలజీ వాడుతున్నారు. దీనివల్ల ఛార్జర్లు ఎక్కువగా వేడెక్కవు. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను ఒకే ఛార్జర్‌తో చాలా వేగంగా, సురక్షితంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కాబట్టి కొంత డబ్బు ఆదా చేయాలని చూసి కొన్ని వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్‌ను, మీ భద్రతను పణంగా పెట్టవద్దు. నాణ్యమైన ఛార్జర్‌పై పెట్టే ప్రతీ రూపాయి మన ఫోన్లకి రక్షణగా నిలుస్తుంది.

Also Read: మీ ఇయర్‌బడ్స్‌లో ఒకవైపే సౌండ్ బాగా వినిపిస్తోందా? కొత్తవి కొనే ముందు ఇవి చెక్ చేయండి!

Tags

Related News

నాయిస్ ఐకాన్ 2 ఎలైట్ ఎడిషన్.. స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్!

ఇంత తక్కువ ధరకి ఇలాంటి ల్యాప్‌టాప్స్ వస్తున్నాయా? ట్రెండింగ్‌లో ఉన్న 5 మోడల్స్‌ ఇవే!

రూ.600కే 48 గంటల బ్యాటరీ లైఫ్‌తో.. మ్యాజిక్‌జోన్ ఇయర్‌బడ్స్!

మీ ఇయర్‌బడ్స్‌లో ఒకవైపే సౌండ్ బాగా వినిపిస్తోందా? కొత్తవి కొనే ముందు ఇవి చెక్ చేయండి!

పెద్ద ట్విస్ట్ ఇచ్చిన యాపిల్.. ఫోల్డబుల్ ఐఫోన్ పేరు అల్ట్రా కాదట? లీకైన అసలు పేరు ఇదే!

రూ.1,251కే బెస్ట్ ఇయర్‌బడ్స్! ఫిలిప్స్ TAT1269 స్పెషల్స్ చూశారా?

13.3 అంగుళాల భారీ డిస్‌ప్లే.. 3 నానోమీటర్ చిప్.. షియోమీ కొత్త టాబ్లెట్ ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×