Prerana Kambam: బుల్లితెర నటిగా కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి ప్రేరణ కంభ (Prerana Kambam). ఈ సీరియల్లో కృష్ణ పాత్ర ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8)రియాలిటీ షోలో పాల్గొన్నారు. రియాలిటీ షోలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచిన ప్రేరణ అనంతరం ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో తన భర్త శ్రీపాద్ దేశ్పాండేతో కలిసి ఈ కార్యక్రమంలో సందడి చేయడమే కాకుండా విజేతగా కూడా నిలిచారు. ఇలా పలు బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న ప్రేరణ గత కొంతకాలంగా సోషల్ మీడియాకు అలాగే బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు.
ఇలా ఈమె బుల్లితెరపై కనిపించని నేపథ్యంలో అభిమానులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఇటీవల ఊహించని విధంగా ప్రేరణ తన భర్త శ్రీపాద్ (Sripaad)తో కలిసి అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని విషయాన్ని తెలియజేస్తూ బేబీ బంప్(Baby Bump) ఫోటోలను షేర్ చేశారు. దీనితో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవ్వడంతో అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలియజేశారు. అయితే ప్రేరణ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టకుండా చాలా రహస్యంగా ఉంచారు.
ప్రేరణ మరి కొద్ది రోజులలో బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టారు అయితే తాజాగా ఈవెంట్ తన సీమంతపు వేడుకలకు(Baby Shower Ceremony) సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ బద్దంగా ప్రేరణ సీమంతపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలా సీమంతపు వేడుకకు సంబంధించిన వీడియోని ఈమె షేర్ చేస్తూ… మరో విశ్వంలో ఈ జయమ్మ తన వంశం వారసుడు రాక కోసం వేడుక జరుపుకుంటుంది. ఒక సీమంతపు వేడుక వందల ఆశీర్వాదాలు జీవితకాలం ప్రేమ బయటపడటానికి వేచి ఉందంటూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.
?xtok=ZWF5aHA4dmM5dmll
ఇలా ఈ సీమంతపు వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ప్రేరణ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ప్రేరణ బుల్లితెరపై నటించింది కేవలం ఒక సీరియల్ లో అయినప్పటికీ కృష్ణ పాత్రలో మాత్రం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ తర్వాత ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈమె పెద్దగా ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రెగ్నెన్సీ(Pregnancy) కారణంగానే ప్రేరణ బ్రేక్ తీసుకున్నారని తెలుస్తుంది.
Also Read: RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!