E-Paper
Advertisement

కేవలం 14 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉంటే.. శరీరంలో జరిగే మార్పులివే!

కేవలం 14 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉంటే.. శరీరంలో జరిగే మార్పులివే!
Advertisement

No Sugar Challenge: మరి కొన్ని నెలల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. దీంతో చాలామంది బరువు తగ్గాలని, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంటారు. అందులో అత్యంత ప్రభావవంతమైనది పంచదారకు దూరంగా ఉండటం. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం రెండు వారాల పాటు అదనంగా కలిపే చక్కెరలను పూర్తిగా పక్కన పెడితే మన శరీరంలో ఊహించని మెరుగైన మార్పులు వస్తాయిట.

మొదటి మూడు రోజుల కష్టం..

చక్కెర తినడం ఆపేసిన తొలి మూడు రోజులు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మెదడుకి అలవాటైన తీపి అందకపోవడంతో తీవ్రమైన క్రేవింగ్స్ వస్తాయి. తలనొప్పి, నీరసం, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది శరీరం డిటాక్స్ అవుతున్నప్పుడు వచ్చే సాధారణ ప్రతిస్పందన మాత్రమే తప్ప ప్రమాదకరమైనది కాదు.

కోలుకునే రెండవ దశ..

Advertisement

నాలుగో రోజు నుంచి ఏడో రోజు మధ్యలో శరీరం కొత్త జీవనశైలికి అలవాటు పడటం మొదలవుతుంది. రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం ఆగిపోవడంతో రోజంతా శక్తి స్థిరంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం తగ్గి, మధ్యాహ్నం వేళల్లో వచ్చే నిద్రమత్తు పూర్తిగా మాయమవుతుంది. తీపి తినాలనే కోరికలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.

Also Read: నిద్రలో కాలి కండరాలు పట్టేయడానికి కారణమేంటి? ఎప్పుడు ప్రమాదకరమంటే..

స్పష్టమైన ఆరోగ్య మార్పులు..

Advertisement

ఎనిమిదో రోజు నుంచి పద్నాలుగో రోజు మధ్య శరీరంలో అసలైన మెరుగుదల కనిపిస్తుంది. శరీరంలో వాపు తగ్గి పొట్ట కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలు మెరుగై, నిజమైన ఆకలికి, కేవలం అలవాటు కొద్దీ తినడానికి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. దాంతో పాటు రాత్రివేళల్లో ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పడుతుంది.

కాలేయానికి దక్కే ఉపశమనం..

రెండు వారాల వ్యవధి పూర్తయ్యేసరికి కాలేయం మీద ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ప్రతిరోజూ వచ్చే అదనపు చక్కెరను ప్రాసెస్ చేసే అవసరం లేకపోవడంతో ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రత తగ్గుతుంది. అలాగే నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ రీసెట్ అయ్యి, అతిగా ఉండే తీపి రుచులు అస్సలు నచ్చవు. ఇది భవిష్యత్తులో కూడా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకు బాటలు వేస్తుంది.

ఇది క్రాష్ డైట్ కాదు..

తీపి మానడం అంటే కార్బోహైడ్రేట్లు పూర్తిగా ఆపేయడం లేదా పండ్లు తినడం మానేయడం కాదు. కేవలం శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన జ్యూసులు, స్వీట్లు, బేకరీ తిను బండారాల ద్వారా శరీరంలోకి వెళ్లే అనవసరపు చక్కెరలను మాత్రమే దూరం పెట్టాలి. రెండు వారాల ఈ చిన్న ప్రయత్నం మీ జీవక్రియను రీసెట్ చేసి, భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.

Also Read: విదేశీయులు ఇష్టపడే ఈ ఇండియన్ డిష్ పుట్టింది బ్రిటన్‌లోనే అని తెలుసా?

Tags

Related News

విదేశీయులు ఇష్టపడే ఈ ఇండియన్ డిష్ పుట్టింది బ్రిటన్‌లోనే అని తెలుసా?

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

Big Stories

Advertisement
×