E-Paper
Advertisement

Rowdy Janardhan Teaser: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Rowdy Janardhan Teaser: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Advertisement

Rowdy Janardhan: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం వరుస సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ 15వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రౌడీ జనార్ధన్(Rowdy Janardhan). ప్రముఖ దర్శకుడు రవి కిరణ్ కోలాదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాను 2026లో విడుదల చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్నా ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాని నేపథ్యంలో అభిమానులు సినిమా నుంచి అప్డేట్ కావాలని కోరుతున్నారు.

విజయ్ కు జోడిగా కీర్తి సురేష్..

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఈ టీజర్ ను డిసెంబర్ 18వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న విజయ్ దేవరకొండ తదుపరి సినిమా విషయంలో అభిమానులు కూడా కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

డిసెంబర్ 18న టీజర్..

Advertisement

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక డిసెంబర్ 18వ తేదీ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలబడునుంది. ఇక విజయ్ దేవరకొండ చివరిగా కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.
ఇక ప్రస్తుతం రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రష్మికతో విజయ్ వివాహం..

Advertisement

ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయటానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే విజయ్ దేవరకొండ త్వరలోనే రష్మికను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: Bigg Boss 9- Bharani: ఎలిమినేషన్ తర్వాత భరణి ఫస్ట్ పోస్ట్.. ముగింపు కాదంటూ!

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×