E-Paper
Advertisement

Palnadu: నల్లగా ఉండటమే నా తప్పా? అత్తింటి ముందు కోడలు ధర్నా

Palnadu: నల్లగా ఉండటమే నా తప్పా? అత్తింటి ముందు కోడలు ధర్నా
Advertisement

పల్నాడు జిల్లా వినుకొండలో వరకట్న వేధింపులు, రంగు పేరుతో అమానుషంగా హింసించిన సంఘటన కలకలం రేపింది. తాను నల్లగా ఉన్నాననే కారణంతో అశుభాలు జరుగుతున్నాయని, దీనికి తోడు అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారంటూ గోపిలక్ష్మి అనే కోడలు తన అత్తారింటి ఎదుటే న్యాయపోరాటానికి దిగింది.

గత జూన్‌లో కోటేశ్వరరావుతో గోపిలక్ష్మికి వివాహం జరిగింది. పెళ్లైన కేవలం రెండు నెలల నుండే వేధింపులు మొదలయ్యాయని గోపిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తోటి కోడలు రూ. 80 వేలు సంపాదిస్తుందని, తాను సంపాదించడం లేదంటూ కూడా నిత్యం నిందిస్తున్నారని ఆమె కన్నీరు పెట్టుకుంది. న్యాయం జరగాలంటూ బాధితురాలు తన అత్తారింటి ఎదుట ఆందోళన చేపట్టింది.

Advertisement

గోపిలక్ష్మి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డను కోటీశ్వరులు అని నమ్మి ఆస్తులు అమ్మి పెళ్లి చేశానని, ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధించడం అన్యాయమని అన్నారు. కనీసం తిండి కూడా పెట్టడం లేదని తన బిడ్డ చెబుతోందని వాపోయారు. ఈ విషయంపై అడగడానికి వచ్చిన తమపై దాడికి ప్రయత్నించారని, తమను చూడగానే ఇంటికి తాళం వేసి పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వినుకొండలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోపిలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె తండ్రి స్పష్టం చేశారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×