E-Paper
Advertisement

Bigg Boss 9 -Bharani: ఎలిమినేషన్ తర్వాత భరణి ఫస్ట్ పోస్ట్.. ముగింపు కాదంటూ!

Bigg Boss 9 -Bharani: ఎలిమినేషన్ తర్వాత భరణి ఫస్ట్ పోస్ట్.. ముగింపు కాదంటూ!
Advertisement

Bigg Boss 9 -Bharani: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. సెప్టెంబర్ 7వ తేదీ ప్రారంభమైన ఈ కార్యక్రమం మరొక వారంలో పూర్తికానుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఐదుగురిలో ఇద్దరు కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి వచ్చిన వారు కావటం విశేషం. ఇక 14వ వారంలో భాగంగా హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన భరణి..

14వ వారంలో భాగంగా డబుల్ ఎలిమినేషన్ జరగడంతో హౌస్ నుంచి సుమన్ శెట్టి శనివారం ఎలిమినేట్ కాగా ఆదివారం భరణి (Bharani) ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భరణి సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి , తనను సపోర్ట్ చేసిన అభిమానులను ఉద్దేశిస్తూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా భరణి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు..

Advertisement

జీవితంలో గెలుపు ఓటములు ఒక భాగం మాత్రమేనని తెలిపారు కానీ మీరు ఈ ప్రయాణంలో నాకు తెలిపిన మద్దతు అతిపెద్ద విజయం. నేను ఎంతో గర్వంగా, కృతజ్ఞతతో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలతో బయటకు వెళ్తున్నాను. ఇవన్నీ కూడా కేవలం మీ వల్లే జరిగిందని, మీ ప్రేమను ముందుకు తీసుకెళ్లి నేను చేసే ప్రతి పనిలోనూ నా వంతు కృషి చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మరోసారి నా వెంట బలంగా నిలిచినందుకు, నన్ను నమ్మినందుకు, మీ ప్రేమను నాకు అందించినందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. ఇది ముగింపు మాత్రం కాదని ,ఒక కొత్త ప్రారంభమని తెలియజేశారు మీరు నాతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మీ అంతులేని ప్రేమ గౌరవంతో మీ భరణి అంటూ ఈయన సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.

Advertisement

ఈ విధంగా భరణి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఈయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆరవ వారంలో భరణి ఒక్కసారి ఎలిమినేట్ అయ్యి అనంతరం వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈయన హౌస్ లో 12 వారాలు పాటు కొనసాగారని తెలుస్తోంది. ఇలా 12 వారాలపాటు హౌస్ లో కొనసాగిన భరణి ఏకంగా 40 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులపాటు సీరియల్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భరణి బిగ్ బాస్ కార్యక్రమంతో మరింత ఆదరణ సొంతం చేసుకున్నారు. ఒక బిగ్ బాస్ తర్వాత ఈయనకు తదుపరి ఎలాంటి అవకాశాలు వస్తాయో తెలియాల్సి ఉంది.

Also Read: Jailer 2 Release:  రజనీకాంత్ జైలర్ 2 రిలీజ్ డేట్ అప్డేట్…ప్రభాస్ కు పోటీగా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×