Vijay Rashmika: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26 తేదీ పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఇప్పటివరకు పలు ఆలయాలను సందర్శిస్తూ హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి తర్వాత చేయాల్సిన పూజ కార్యక్రమాలు అన్నింటిని కూడా పూర్తి చేస్తున్నారు. మరి కాసేపట్లో రష్మిక విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి తర్వాత ఈ జంట మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నేను పెళ్లి చేసుకొని రష్మికతో కలిసి మీ ముందుకు జంటగా వచ్చాను. ఈ ఫీలింగ్ ఏదో కొత్తగా ఉందని, తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చిందని ప్రతి ఒక్కరు తనని ఆశీర్వదించి ఆదరించండి అంటూ ఈ సందర్భంగా విజయ్ రష్మిక గురించి తనని పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనంతరం రష్మిక మందన్న కూడా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తో తన కొత్త లైఫ్ ప్రారంభించానని అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ఈమె కోరారు.
ఇలా పెళ్లి తర్వాత ఈ జంట పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించడమే కాకుండా అభిమానులకు స్వీట్లు పంచడం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చేస్తున్నారు అలాగే అభిమానులను కలిసి స్వయంగా అభిమానులకు విందు భోజనాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే . స్వయంగా రష్మిక విజయ్ అభిమానులకు వడ్డించారు. ఇక నేడు మొదటిసారి వీరిద్దరూ జంటగా మీడియా ముందుకు రావడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి కాసేపట్లో రష్మిక విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతున్న సంగతి తెలిసిందే.
ఘనంగా విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్..
ఈ వివాహ రిసెప్షన్ హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో ఎంతో ఘనంగా జరగబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలివచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విజయ్ రష్మిక నిబంధనలను కూడా విధించారు. కేవలం ఆహ్వానం ఉన్నవారు మాత్రమే ఈ కార్యక్రమానికి రావాలని అలాగే వన్ టైం క్యూ ఆర్ కోడ్ స్కాన్ ఉంటుందని తెలిపారు. అందుకే ఆహ్వానం అందిన వాళ్లు మాత్రమే ఈ రిసెప్షన్ వేడుకకు హాజరు కావాలి అంటూ ముందుగానే సూచించారు. ఆహ్వానం లేకుండా అక్కడికి వచ్చి ఇబ్బందులు పడొద్దని భద్రత చర్యలను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండటం కోసమే ఇలాంటి నిబంధనలను విధించారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలందరూ హాజరు కాబోతున్నారు అలాగే రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Also Read: Vijay Rashmika: పెళ్లి కానుకగా భార్యకు విజయ్ స్పెషల్ గిఫ్ట్..ఫిదా అయిన రష్మిక?