E-Paper
Advertisement

Vijay Rashmika: రష్మిక గురించి విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ పెట్టిన ట్వీట్ ఇదే.. అప్పుడే చెప్పేశాడు..

Vijay Rashmika: రష్మిక గురించి విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ పెట్టిన ట్వీట్ ఇదే.. అప్పుడే చెప్పేశాడు..
Advertisement

Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ ఇద్దరి పేర్లు వినపడగానే కుర్రకారులో ఒక రకమైన సందడి మొదలవుతుంది. టాలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ ‘విరోష్’ (ViRash) పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ గతంలో రష్మిక గురించి చేసిన అతి మొదటి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తోంది.

Read also-Dhurandhar Impact: ధురంధర్‌కి అంత సీన్ ఉందా?.. పాన్ వరల్డ్ సినిమాని పరుగెట్టించిందిగా!

ఒక మ్యాజికల్ బిగినింగ్

Advertisement

వీరిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమా సెట్స్ పైనే వీరి మధ్య స్నేహం మొదలైంది. ఆ సమయంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ (X) ఖాతాలో ఒక పోస్టర్‌ను షేర్ చేస్తూ రష్మికను ఉద్దేశించి చేసిన కామెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్‌లో విజయ్ ఇలా రాసుకొచ్చారు “నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నా నడుం నొప్పి వచ్చినా నీ బరువు బాధ్యతలు ఎప్పుడూ నావే మేడం” ఈ డైలాగ్ అప్పట్లో సినిమాపై భారీ అంచనాలను పెంచడమే కాకుండా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని కూడా చాటిచెప్పింది. సినిమాలో గోవిందం పాత్రలో విజయ్, గీత పాత్రలో రష్మికను తన వీపుపై ఎక్కించుకుని వెళ్లే సీన్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సీన్‌కు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేస్తూ విజయ్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలే ఇప్పుడు వారి నిజజీవిత బంధానికి సంకేతాలుగా అభిమానులు భావిస్తున్నారు.

Read also-Vijay Rashmika: తెలుగు వారికి కొత్త కోడలు వచ్చింది ఆశీర్వదించండి: విజయ్ దేవరకొండ

వైరల్ కావడానికి కారణాలు

Advertisement

అభిమానులు వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఆనాటి స్నేహం నేడు పెళ్లి పీటల వరకు రావడం విశేషం. విజయ్ ఆ పోస్ట్‌లో వాడిన “నీ బరువు బాధ్యతలు ఎప్పుడూ నావే” అనే మాట ఇప్పుడు నిజం కాబోతోందని, రష్మిక బాధ్యతను విజయ్ జీవితాంతం తీసుకోబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో కూడా ఈ జంట తమ నటనతో మెప్పించారు. అయితే వీరిద్దరి పెళ్లి దేశంలోనే అత్యంత ప్రతిస్టాత్మకంగా జరిగిన విషయం తెలిసిందే.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×