E-Paper
Advertisement

ధనుష్‌తో అమిత్ షా ‘ఆపరేషన్-డి’.. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ ఎటాక్!

ధనుష్‌తో అమిత్ షా ‘ఆపరేషన్-డి’.. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ ఎటాక్!
Advertisement

Dhanush Politics; దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాజకీయం వేరు సినీ గ్లామర్ వేరు. కానీ తమిళనాడులో అలా కాదు. అక్కడి సినీ గ్లామరే రాజకీయాన్ని శాసిస్తుంది. కాలం కలిసొస్తే అధికారం చేజిక్కించుకొని పాలిస్తుంది. ఎంజీఆర్‌తో మొదలైన ఈ ట్రెండ్ స్టిల్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు హీరో ధనుష్ అడుగులు కూడా పాలిటిక్స్ వైపు పడుతున్నాయనే చర్చ.. టాక్ ఆఫ్ ది తమిళనాడుగా మారింది. ఇటీవలే చెన్నైలో తన అభిమాన సంఘం మహిళా విభాగం సభ్యులను ధనుష్ కలిశారు. దాదాపు 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారితో ఫోటోలు దిగి దీపావళి కానుకగా వెండి దీపాలను అందజేశారు. వాటిపై బీజేపీ ఎన్నికల సింబల్ కమలం ముద్ర ఉండటం రాజకీయంగా చర్చకు దారితీసింది.

తమిళగ ఎళుచ్చి కళగం పేరుతో..

అయితే, ఆ గుర్తు దీపాల తయారీదారుకు చెందిందేనని, దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ధనుష్ అభిమాన సంఘం ప్రతినిధి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమిళగ ఎళుచ్చి కళగం పేరుతో ధనుష్ కొత్త పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇటీవలే ఆయన అభిమాన సంఘం పేరుని కూడా ధనుష్ నర్పణి ఇయక్కం అని మార్చారు. స్టేట్ వైడ్ కొత్త ఆర్గనైజర్లను నియమించడంతో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

Advertisement

Also read: కిరణ్ అబ్బవరం ‘భజగోవిందం’ సాంగ్ పై ఏపీ సీఎం ప్రశంసలు.. రియాలిటీ పై పెరిగిన బజ్!

ధనుష్ వెంట బీజేపీ.. 

ధనుష్ ఫ్యాన్స్ మీట్స్ చూశాక కాంగ్రెస్ సహా కొందరు రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్లు కూడా ఇప్పుడు డిబేట్‌కు దారితీశాయ్. ముఖ్యంగా తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ మాణిక్కం ఠాగూర్ అయితే ధనుష్ వెంట బీజేపీ ఉందని కామెంట్ చేశారు. తమిళనాడు ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు బీజేపీ ఆపరేషన్-డి మొదలుపెట్టిందన్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్‌ని క్యాప్చర్ చేసేందుకు.. బీజేపీ ట్రై చేస్తోందన్నారు. సినీ గ్లామర్ ఉన్న పార్టీ ఓట్ బ్యాంక్‌ని తమవైపు తిప్పుకోవాలంటే మళ్లీ ఫిల్మ్ స్టార్‌నే రంగంలోకి దించాలనే వ్యూహం అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే అమిత్ షా ధనుష్‌ని వెనకుండి నడిపిస్తున్నారని.. మాణిక్కం ఠాగూర్ చెబుతున్నారు.

రజనీకాంత్ చేత పార్టీ..

Advertisement

మరోవైపు బీజేపీ కూడా తమిళనాడులో పాగా వేసేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. మొదట అన్నాడీఎంకే పొత్తు పొట్టుకున్నా అనుకూల ఫలితం రాలేదు. దాంతో తర్వాత రజనీకాంత్ చేత పార్టీ పెట్టించే ప్రయత్నం చేశారనే చర్చ కూడా ఉంది. అది కూడా ఫెయిల్ అవడంతో.. అన్నామలైని రంగంలోకి దించారు. అయినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు.. ధనుష్‌ని ముందుంచి వెనకనుంచి పొలిటికల్ గేమ్ నడిపించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏదేమైనా ధనుష్ అడుగులు, వ్యవహారం చూస్తుంటే త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. విజయ్ విక్టరీ ఫార్ములా కూడా ఇదే కదా! ముందు ఫ్యాన్స్ మీట్లు పెట్టారు. అభిమాన సంఘాలను బలోపేతం చేశారు. గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాకే పాలిటిక్స్‌లోకి దిగారు. పవర్‌లోకి వచ్చారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి తమిళనాడు ధనుష్‌ని లీడర్‌గా యాక్సెప్ట్ చేస్తుందా? యాక్టర్‌గానే చూస్తుందా? అన్నది కాలమే సమాధానం చెబుతుంది.

Also read: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తల్లీకూతుళ్ల చోరీలు.. రూ. 10.60 లక్షల సొత్తు స్వాధీనం!

Tags

Related News

భారత్‌లో మారిన బంగారం దిగుమతుల మ్యాప్.. జోరందుకున్న దుబాయ్ రూట్!

AIADMK ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ పిటిషన్ కొట్టివేత!

హోటల్ గదిలో నవ వధువు మృతి.. 6 సెకన్లు ఏం జరిగింది? సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

అయ్య బాబోయ్ డబ్బే డబ్బు.. ఏకంగా రూ. 4 కోట్ల హవాలా మనీ, ఎక్కడి నుంచి ఎక్కడకంటే..

హోసూరులో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి .. ఆపై లారీ కింద పడి ప్రియుడి సూసైడ్!

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు

రాహుల్‌కు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లోని వాహనాలు ఢీ, పలువురికి గాయాలు

Big Stories

Advertisement
×