QR Code Scams: యూపీఐ పేమెంట్స్ చేసే క్రమంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్‌లను గుడ్డిగా స్కాన్ చేయడం వల్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఈ 5 పొరపాట్లు అస్సలు చేయవద్దని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
రోడ్డు పక్కన హోర్డింగ్‌లపై, బస్ స్టాప్‌లలో లేదా పబ్లిక్ ప్రదేశాలలో ‘ఫ్రీ వైఫై’ (Free Wi-Fi), ఉచిత గిఫ్ట్‌లు, కూపన్ల పేరుతో క్యూఆర్ కోడ్‌లు కనిపిస్తుంటాయి. అలాగే సోషల్ మీడియాలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పంపే కోడ్‌లను ఆఫర్ల కోసం ఆశపడి అస్సలు స్కాన్ చేయెుద్దు. అలా చేస్తే అవి హ్యాకర్ల వలలో నెట్టేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పొరపాటున ఏదైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మొబైల్ స్క్రీన్ పై ఒక వెబ్‌సైట్ లింక్ పాప్-అప్ అవుతుంది. ఆ లింక్ ఏంటో, ఎక్కడికి తీసుకెళ్తుందో సరిగ్గా చూడకుండానే వెంటనే ఓపెన్ చేయడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అసలైన వెబ్‌సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని పేర్కొంటున్నారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అనుమానాస్పద వెబ్‌సైట్‌లోకి వెళ్లినట్లయితే అక్కడ ఎట్టిపరిస్థితుల్లో బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ పిన్ నంబర్లు, ఆధార్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయవద్దు. ఏమాత్రం నమ్మకం లేని ప్లాట్‌ఫారమ్‌లలో వ్యక్తిగత వివరాలను పంచుకోవడం వల్ల క్షణాల్లో ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్‌లోని ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ యాప్‌లు, బ్రౌజర్‌లను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఫోన్ అప్‌డేట్ నోటిఫికేషన్లను నిర్లక్ష్యం చేస్తుంటారని, దీనివల్ల ఫోన్‌లోని సెక్యూరిటీ బలహీనపడి మాల్వేర్ తేలిగ్గా ఫోన్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని గుర్తుచేస్తున్నారు.
Also Read: నో సిగ్నల్స్, నో వెహికల్స్.. అయినా ఈ ద్వీపానికి పర్యాటకుల క్యూ.. అసలు ఏముందిక్కడ?
స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ మంచి యాంటీవైరస్ లేదా సెక్యూరిటీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అనుకోకుండా తప్పుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా, ఆ సెక్యూరిటీ యాప్‌లు వెంటనే అప్రమత్తం చేసి ప్రమాదం నుంచి రక్షిస్తాయని స్పష్టం చేస్తున్నారు.
Also Read: నీలగిరి మౌంటైన్ రైల్వే అలర్ట్.. మెట్టుపాళయం–ఊటీ రైళ్లు రద్దు, ఎందుకంటే?