E-Paper
Advertisement

రష్మికను అన్ ఫాలో చేసిన విజయ్ దేవరకొండ…తెర పైకి విడాకుల వార్తలు?

రష్మికను అన్ ఫాలో చేసిన విజయ్ దేవరకొండ…తెర పైకి విడాకుల వార్తలు?
Advertisement

Rashmika -Vijay Devarakonda: టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ రష్మిక మందన్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు తరచూ విజయ్ రష్మిక సోషల్ మీడియా వేదికగా ఒకరి గురించి ఒకరు చేసుకునే పోస్టులు చూస్తే మాత్రం వీరిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతుంది. అయితే గత రెండు రోజులుగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రష్మిక (Rashmika)గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విడాకులు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

బావోద్వేగానికి గురైన రష్మిక..

విజయ్ రష్మిక రణబాలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ చేసిన కామెంట్స్ పట్ల రష్మిక భావోద్వేగానికి గురి అయ్యారని ఈ షోని ఏకంగా ఒక గంట పాటు కరణ్ నిలిపివేశారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ కార్యక్రమం ప్రసారమైన తరువాత రష్మిక విజయ్ విడాకుల (Divorce)వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో రష్మికను అన్ ఫాలో చేయడం కూడా ఈ విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చింది.

రష్మికను అన్ ఫాలో చేసిన కొండన్న…

Advertisement

విజయ్ దేవరకొండ రష్మికను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసినప్పటికీ రష్మిక మాత్రం విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో ఎవ్వరిని ఫాలో కాకపోవటం గమనార్హం. విజయ్ రష్మికను ఫాలో చేయకపోయినా తన ఇన్స్టాగ్రామ్ లో మాత్రం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు రష్మిక తో కలిసి దిగిన కొన్ని క్యూట్ పిక్స్ అలాగే ఉండడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.ఇలా విజయ్ రష్మిక విడాకులు తీసుకుని విడిపోతున్నారని చెప్పడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేనప్పటికీ వీరి విడాకులు వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

విడాకులు వార్తలపై విరోష్ ఫాన్స్ ఫైర్..

ఈ నేపథ్యంలోనే విజయ్ రష్మిక అభిమానులు మాత్రం విడాకులు వార్తలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పెళ్లయి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న జంట విడిపోతున్నారని ఎలా చెప్పగలరు? ఇలాంటి వార్తలను సృష్టించడానికి కాస్త బుద్ధుండాలి అంటూ విరోష్ ఫాన్స్ ఈ వార్తలపై మండిపడుతున్నారు. మరి విడాకుల రూమర్ల గురించి విజయ్ రష్మిక స్పందిస్తారా లేదంటే లైట్ తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక విజయ్ రష్మిక దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమలో కొనసాగుతూ అనంతరం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.

Advertisement

Also Read: నాని ది ప్యారడైజ్ మూవీకి మహేష్ కొడుకు గౌతమ్ రేటింగ్..ఇంత దారుణమా?

Related News

కృష్ణ మరణం మహేష్, నరేష్ మధ్య విభేదాలు.. నటుడు క్లారిటీ!

రాజమౌళి నుంచి త్రివిక్రమ్ వరకు.. తనికెళ్ల భరణి చెప్పిన ఆసక్తికర విషయాలు!

నాని ది ప్యారడైజ్ మూవీకి మహేష్ కొడుకు గౌతమ్ రేటింగ్..ఇంత దారుణమా?

రణబాలి ఎఫెక్ట్.. ‘మైసా’పై భారీ బజ్.. రంగంలోకి బిగ్ డిస్ట్రిబ్యూటర్స్!

ధనుష్ పొలిటికల్ మీటింగ్.. 3000 మంది మహిళా ప్రతినిధులతో!

ఫౌజీ మూవీపై ట్రోల్స్.. నందమూరి హీరో మూవీతో పోలుస్తూ!

స్క్రిప్ట్‌లో లేని కామెడీ.. ఆలీ, బాబూమోహన్ కలిసి చేసిన అల్లరి ఇదే!

Big Stories

Advertisement
×