E-Paper
Advertisement

ఆదిలాబాద్ జిల్లా ST కుల ధృవీకరణ పత్రాల వివాదానికి.. ప్రభుత్వం చెక్!

ఆదిలాబాద్ జిల్లా ST కుల ధృవీకరణ పత్రాల వివాదానికి.. ప్రభుత్వం చెక్!
Advertisement

Caste Certificates: ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులకు కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు చట్టబద్ధంగా, సమగ్రంగా పరిష్కారం చూపాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ అంశం అత్యంత సున్నితమైనదని, అర్హులైన గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడటంతోపాటు, అనర్హులు కుల ధృవీకరణ పత్రాలు పొందకుండా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

కుల ధృవీకరణ పత్రాలు..

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఆదిలాబాద్‌ జిల్లాలో కుల ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన సమస్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని ఏయే గ్రామాలు, మండలాల్లో సమస్య తీవ్రంగా ఉందో గుర్తించి, అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా 1950కి ముందు ఉన్న ఆధారాలు, అప్పటి చట్టపరమైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న పాత రికార్డులు, ఓటరు జాబితాలు తదితర ఆధారాలను సమగ్రంగా పరిశీలించి అర్హత ఉన్న వారికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశం..

Advertisement

మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వ్యక్తులు స్థానిక గిరిజనులుగా కుల ధృవీకరణ పత్రాలు పొందేందుకు చేసే క్లెయిమ్‌లను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. నిజమైన స్థానిక గిరిజనులకు నష్టం కలగకుండా చూడటంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ధృవీకరణ పత్రాలు పొందకుండా రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే నిజమైన గిరిజనులను రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే భావన కలగకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.

Also read: ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

ఓటరు జాబితాలు..

Advertisement

అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి చట్టపరమైన హక్కు లభించేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సమస్య ఉన్న గ్రామాలు, మండలాల వారీగా వివరాలను సేకరించి, పాత రెవెన్యూ రికార్డులు, ఓటరు జాబితాలు, కుటుంబ వివరాలు, స్థానిక నివాసానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ఒకే విధమైన నిబంధనలను అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తూ, అర్హత నిర్ధారణకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఈ సమస్యపై నవంబర్‌ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అప్పటిలోగా అధికారులు గ్రామాలు, మండలాల వారీగా సమస్యల వివరాలను సేకరించి, అర్హత కలిగిన దరఖాస్తుదారుల పరిస్థితి, పెండింగ్‌ దరఖాస్తులు, ఎదురవుతున్న న్యాయపరమైన అంశాలు తదితర వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.

నిబంధనల ప్రకారం..

అన్ని వర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం మంత్రిగా తన బాధ్యత​ అని తెలిపారు. అర్హులైన గిరిజనులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా చట్టపరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తామని వెల్లడించారు. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ప్రయోజనం పొందకుండా చూస్తున్నట్లు స్పష్​టంచేశారు. అర్హులైన గిరిజనులకు ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో అనవసర జాప్యం లేకుండా చూడాలని, సందేహాస్పద కేసులను నిబంధనల ప్రకారం సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గిరిజన సంక్షేమ శాఖ..

ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్హర్‌ మహేష్‌దత్‌ ఏక్తా, ప్రత్యేక కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సంతోష్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా, టీసీఆర్‌అండ్‌టీఐ డైరెక్టర్‌ డాక్టర్‌ వీ సముజ్వల, ఐటీడీఏ ఉట్నూర్‌ ఏపీవో వసంతరావు, టీసీఆర్‌ అండ్ టీఐ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లీల, మూడు మండలాల తహసీల్దార్లు, బోథ్ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, శ్యాంనాయక్‌, నరేష్‌జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Also read: హైదరాబాద్ ‘సిటీ’వాసులకు సూచన.. కేవలం రూ.600 లకే బస్సు పాస్, ఇంకెందుకు ఆలస్యం

Tags

Related News

ఎల్ నినో కరువు మండలాల లెక్కింపుపై.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

టికెట్ గొడవ.. కండక్టర్‌ను రన్నింగ్ బస్సులోంచి తోసేసిన మహిళ!

ORRపై ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు దుర్మరణం!

మామను మించిన అల్లుడు.. అబద్ధాల్లో హరీష్‌దే నంబర్ 1: మెట్టుసాయి కుమార్

హైదరాబాద్ ‘సిటీ’వాసులకు సూచన.. కేవలం రూ.600 లకే బస్సు పాస్, ఇంకెందుకు ఆలస్యం

‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్

హైదరాబాద్‌లో నీటి వృథాపై నిఘా.. నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే రూ. 5 వేలు ఫైన్

Big Stories

Advertisement
×