E-Paper
Advertisement

ORRపై ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు దుర్మరణం!

ORRపై ఘోర ప్రమాదం.. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు దుర్మరణం!
Advertisement

ORR Accident: సంగారెడ్డి జిల్లా కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌ (ORR) వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింగ్ రోడ్ ఎగ్జిట్ సమీపంలో డివైడర్‌పై ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన అశోక్ లీలాండ్ వాహనం బలంగా ఢీకొట్టింది.

స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

Advertisement

ఈ ప్రమాదం తీవ్రతకు అశోక్ లీలాండ్ వాహన డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, చెట్లకు నీళ్లు పడుతున్న మరో వ్యక్తి కూడా లారీ కిందపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విచారణ వేగవంతం చేసిన పోలీసులు

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కొల్లూర్ పోలీసులు మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

Also Read: మామను మించిన అల్లుడు.. అబద్ధాల్లో హరీష్‌దే నంబర్ 1: మెట్టుసాయి కుమార్

Tags

Related News

ఎల్ నినో కరువు మండలాల లెక్కింపుపై.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

టికెట్ గొడవ.. కండక్టర్‌ను రన్నింగ్ బస్సులోంచి తోసేసిన మహిళ!

ఆదిలాబాద్ జిల్లా ST కుల ధృవీకరణ పత్రాల వివాదానికి.. ప్రభుత్వం చెక్!

మామను మించిన అల్లుడు.. అబద్ధాల్లో హరీష్‌దే నంబర్ 1: మెట్టుసాయి కుమార్

హైదరాబాద్ ‘సిటీ’వాసులకు సూచన.. కేవలం రూ.600 లకే బస్సు పాస్, ఇంకెందుకు ఆలస్యం

‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్

హైదరాబాద్‌లో నీటి వృథాపై నిఘా.. నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే రూ. 5 వేలు ఫైన్

Big Stories

Advertisement
×