E-Paper
Advertisement

Kingdom Movie: ‘కింగ్ డమ్’ మూవీకి బిగ్ షాక్.. ఆన్లైన్లో  HD ప్రింట్ లీక్..

Kingdom Movie: ‘కింగ్ డమ్’ మూవీకి బిగ్ షాక్.. ఆన్లైన్లో  HD ప్రింట్ లీక్..
Advertisement

Kingdom Movie: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్’.. స్టార్ డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే విజయ్ కు జోడిగా నటించింది. గత కొద్ది రోజులుగా వరుస అప్డేట్స్, ప్రమోషన్ కార్యక్రమాలతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఒక్కో ఏరియాల్లో ఒక్కో విధమైన టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం తక్కువగానే రావడం ఈ చిత్ర యూనిట్ కు షాక్. ఇప్పుడు ఈ మూవీ ఆన్లైన్లో హెచ్ డి ప్రింట్ లీకయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మేకర్స్ దీన్ని సీరియస్ గా తీసుకున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

‘కింగ్ డమ్’ HD ప్రింట్ లీక్.. 

Advertisement

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ నిన్న థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. అప్పుడే ఆన్లైన్లో ఫుల్ క్లారిటీతో ప్రింట్ లీక్ అవ్వడం టీమ్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి.. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటివి తప్పడం లేదు. కొన్ని ఆన్లైన్ సంస్థలు సినిమాలను లీక్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా ప్రముఖ సంస్థ ఐబొమ్మా లో లీక్ అయ్యినట్లు తెలుస్తుంది. ఫుల్ క్లారిటీతో మూవీ అక్కడ వస్తుంది. ఈ విషయం కాస్త చిత్ర యూనిట్ దృష్టికి వెళ్ళింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న టీమ్ ఆ సంస్థకు హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మూవీని తియ్యకపోవడంతో కింగ్ డమ్ టీమ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Also Read : బాక్సాఫీస్ వద్ద ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్ల జోరు.. ఎన్ని కోట్లంటే..?

Advertisement

పోలీస్ కేసు నమోదు చెయ్యబోతున్న టీమ్.. 

ఇటీవల ఎన్నో సినిమాలు ఫైరసి అవుతున్నాయి. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీకి కూడా ఆ బాధలు తప్పలేదు. ఏజెన్సీల నిర్వాహకంతో పైరసీ చేసే వాళ్లు రెచ్చిపోయి మరింత లింక్స్ పబ్లీష్ చేస్తున్నారు. నిర్మాతలకు నష్టాలను మిగిలిస్తున్నారు. ఈ మేరకు నాగ వంశీ ఈ వెబ్ సైట్ పై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై వెంటనే చర్యలు తీసుకొనేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఏది ఏమైన రిలీజ్ అయిన ఒక్కరోజు కూడా అవ్వకుండా ఇలాంటివి బయటకు రావడం పై విజయ్ ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

ఫస్ట్ డే కలెక్షన్స్..?

కింగ్ డమ్ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ తో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. కానీ కలెక్షన్స్ విషయానికొస్తే లైగర్ కన్నా తక్కువగానే వసూల్ చేసిందని టాక్. అధికారికంగా కలెక్షన్స్ ను ప్రకటించాల్సి ఉంది..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×