Kingdom IBomma : ఈ మధ్యకాలంలో పైరసీ ఎంతలా పెరిగిపోయింది అంటే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాతలకు.. భారీ నష్టం మిగులుతోందని.. ఈ పైరసీల పేరిట థియేటర్లోకి వచ్చి 24 గంటలు గడవకముందే పైరసీ ఫ్లాట్ఫాములలో దర్శనం ఇస్తూ.. నిర్మాతల ఖాతాకు గండి కొడుతున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఒక పైరసీ వెబ్సైట్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మూవీకి 24 గంటలు డెడ్లైన్ విధించడం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో నటించిన చిత్రం కింగ్డమ్(Kingdom). జూలై 31 వ విడుదలైన ఈ సినిమా 24 గంటలు గడవకముందే హెచ్డీ ప్రింట్ తో ఆన్లైన్లో లీక్ అయింది.. ఇలా లీక్ అవడంపై చిత్ర బృందం ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది పోయి.. చిత్ర బృందానికే 24 గంటల డెడ్లైన్ విధించింది పైరసీ సంస్థ ఐ బొమ్మ. ఈ మేరకు ఒక పోస్ట్ కూడా పెట్టింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
కింగ్డమ్ చిత్ర బృందం పై ఐ బొమ్మ మండిపాటు..
అసలు విషయంలోకి వెళ్తే.. నిర్మాతలు కొంతమంది ఏజెన్సీలకు తమ సినిమా పైరసీ కాకుండా డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ ఏజెన్సీ వల్లే ఇప్పుడు పైరసీ పెరిగిపోతుందని ఐ బొమ్మ మండిపడింది. ఈ మేరకు ఒక హెచ్చరిక నోటు జారీ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఐ బొమ్మ రిలీజ్ చేసిన నోట్ లో ఏముందనే విషయానికి వస్తే.. ” మా టీమ్ ముందే చెప్పింది, మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని.. కానీ మీరు మా మాట వినలేదు, మీరు ఏజెన్సీస్ కి డబ్బులు ఇస్తున్నారు. కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కి మా పేరుతో వారే వెబ్సైట్ రన్ చేస్తున్నారు, అన్ని వెబ్సైట్లు ఫోకస్ చేయకుండా సెలెక్టెడ్ వెబ్సైట్ మాత్రమే ఎందుకు ఫోకస్ అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? మీకు బుర్రలేదా? కొంచెం వాడండి.
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి ఐ బొమ్మ డెడ్ లైన్..
ఈ కొత్త సైట్ డబ్బులకోసం ప్రమాదకరమైన మాల్వేర్ యాడ్స్ పెట్టి , వినియోగదారు డేటాను దొంగిలిస్తుంది. దానిని మోసపూరిత పార్టీలకు విక్రయిస్తుంది. ఇదంతా మా బ్రాండ్ పేరును ఉపయోగించి జరుగుతోంది. లాస్ట్ టైం విజయ్ ఇదే సమస్యతో నలిగాడు (ఖుషి).. మళ్ళీ ఇదే సమయంలో నలగటం ఇష్టం లేదు. అందుకే మీకు 24 గంటలు సమయం ఇస్తున్నాం.. మీరు ఈ కింద వెబ్సైట్ బ్లాక్ చేస్తే సరి.. లేదంటే మా పని మేము చేసుకుపోతాం, ఇంకోసారి ఈ నోట్ లు వుండవు, ఇండస్ట్రీ ని కాపాడండి.. అంటూ ఐ బొమ్మ టీం తెలిపింది. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలు పైరసీ ఏజెన్సీల వల్లే జరుగుతోందని నిర్ధారణకు వస్తూ ఉండడం గమనార్హం.
ఏజెన్సీల నిర్వాకంతోనే రెచ్చిపోతున్న పైరసీ..
ఏజెన్సీల నిర్వాకంతో పైరసీ చేసే వాళ్లు రెచ్చిపోయి మరింత లింక్స్ పబ్లీష్ చేస్తున్నారు. ఏజెన్సీలు పైరసీ పేరు చెప్పి ఒక్క సినిమాకు రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు తీసుకుంటున్నారు. పైగా 7 రోజుల్లోనే పైరసీని కట్టడి చేస్తామని అంటున్నారు. కానీ, వీరి వల్ల మరింత పైరసీ ఎక్కువ అవుతుందని ప్రొడ్యూసర్లు గమనించాలి.
ఏజెన్సీలకే వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ.
ఏజెన్సీలు సేమ్ క్లోన్ కాపీ వెబ్ సైట్స్ పెట్టడం వల్ల థర్డ్ పార్ట్ యాడ్ జనరేషన్ వల్ల మనీ మరింత సంపాదిస్తూ డేటా చోరీ జరుగుతుంది. దీని వల్ల మరింత నష్టం జరుగుతుంది.దీన్ని కట్టడి చేయాలంటే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వల్ల మాత్రమే అవుతుంది.
ALSO READ: Balakrishna vs Jr NTR: బాబాయ్ – అబ్బాయ్ మధ్య గొడవలపై బీవీఎస్ రవి క్లారిటీ.. అసలు గొడవ అక్కడే!