Mahavatar Narasimha Collections : సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి చూసేలా సినిమాలు వచ్చేవి. అప్పటిలో వచ్చిన సినిమాలకు జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. రాను రాను స్టోరీ కన్నా పోటీ ఎక్కువ అవ్వడంతో కథల్లో మార్పులు వచ్చేసాయి. ఈ మధ్య రొమాన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు దర్శనం ఇస్తున్నాయి. అవి సక్సెస్ అవ్వడం లేదని కొందరు డైరెక్టర్లు పురాణాల మీద సినిమాలు చేస్తున్నారు. పురాణాల్లోని కొన్ని కథలను ఎంపిక చేసుకొని వాటి మీద సినిమాలు తీసి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అలాగే ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న సినిమా మహావతార్ నరసింహ.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఆరు రోజులకు గాను ఎన్ని కోట్లను వసూలు చేసిందో చూసేద్దాం..
‘మహావతార్ నరసింహ ‘ ఆరు రోజుల కలెక్షన్స్..
హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో ఉండగానే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ మూవీనే ‘మహావతార్ నరసింహ ‘.. నరసింహ స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమా మైథాలజికల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. మొదటి రోజు కోటి 70 లక్షల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది.. మొత్తం నాలుగు రోజులకు గాను దాదాపుగా 23 కోట్లు వసూల్ చేసింది. ఐదో రోజు కూడా వసూళ్లు పెరగడంతో 30 కోట్లకు పైగా వచ్చాయి. ఆరు రోజులకు గాను 42 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read : ‘లైగర్’ కంటే ‘కింగ్‌డం’ కలెక్షన్స్ తక్కువేనా?.. ఇలా అయితే కష్టమే కొండన్న..!
ఈ మూవీ బడ్జెట్ & బ్రేక్ ఈవెన్…
మహావతార్ నరసింహ జులై 25న ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. నటీనటులు లేకుండా కేవలం యానిమేషన్‌తోనే తెరకెక్కిచడం వల్ల పాత్రలతోనూ, ఆ భావోద్వేగాలతోనూ ప్రేక్షకులు మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.. మొత్తానికి మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 4 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ 40 కోట్లకు పైగా వసూల్ చెయ్యడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని చూసేందుకు జనాలు చెప్పులను బయట వదిలేసి వెళుతున్నట్లు ఓ వీడియో క్లిప్పు బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీకెండ్ లోపల 60 కోట్లు దాటే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాల్లో టాక్.. స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి ఈ మూవీ రావడం విశేషం. అలాగే కలెక్షన్స్ రాబట్టడం కూడా మామూలు విషయం కాదు..