శని దేవుడు రాశి చక్రంలో చాలా నెమ్మదిగా తిరిగే గ్రహం. అతడు తిరోగమన స్థితిలో ఉంటే ఎన్నో చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శని దేవుడు మీనరాశిలో తిరుగమనంలో ఉన్నాడు. జూలై 13 నుండి తిరోగమనం మొదలైంది. శాస్త్రంలో శని దేవుడిది ఎంతో ప్రత్యేకమైన స్థానం. ఇతడు ఈ ఏడాది నవంబర్ 28 వరకు తిరోగమనంలోనే ఉంటాడు. కాబట్టి శని అశుభ ప్రభావాలు కొన్ని రాశులపై పడే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రం చెప్పిన ప్రకారం శిని తిరోగమనంలో ఉన్నప్పుడు మూడు రాశుల వారికి నవంబర్ 28 వరకు మంచి కాలం కాదు. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రాశుల వారు నవంబర్ 28 వరకు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.
మేష రాశి
మేషరాశిలో పుట్టిన వారు ఈ నవంబర్ 28 వరకు ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. శని తిరోగమనం వల్ల వీరికి చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ మనసు స్థిరంగా ఉండదు. దానివల్ల జీవితంలో గందరగోళంగా అనిపిస్తుంది. ఏకాగ్రత తప్పుతుంది. ఏ పని పైన దృష్టి పెట్టలేరు. గాయాలు తగిలే అవకాశం ఉంది. మీరు ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్త పనులు ఈ సమయంలో ప్రారంభించకూడదు. అలాగే ఆర్థికంగా నష్టం పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో గొడవలు కూడా జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి
కుంభ రాశిలో పుట్టిన వారు శని తిరోగమన సమయంలో జాగ్రత్తలు పాటించాలి. శని వల్ల వారికి చెడు ప్రభావాలు పడే అవకాశం ఉంది. అందుకే నిత్యం పూజలు, పునస్కారాల్లో పాల్గొనాలి. ఇంట్లో గొడవలు పెరగవచ్చు. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబంలోని వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. వారి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్య చదవాలనుకునే వారు ఇబ్బందులు ఎదురవచ్చు. పెట్టుబడులు ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది.
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా ఈ కాలంలో నష్టాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు శత్రువులు చురుగ్గా ఉంటారు. కాబట్టి వివాదాలు విపరీతంగా పెరుగుతాయి. శత్రువులు మీ పదవికి హాని కలిగించవచ్చు. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఈ సమయంలో మీ మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కష్టాలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ అనుబంధాలలో సమస్యలు మొదలవుతాయి. పిల్లల నుండి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
పైన చెప్పిన మూడు రాశుల వారు శని తిరోగమన సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే బాధలో పెరిగే అవకాశం ఉంటుంది. నిత్యం దేవుని స్మరణ చేయడం చాలా ముఖ్యం. ప్రతి శనివారం ఆ శనీశ్వరుడి మంత్రాన్ని జపించండి.