E-Paper
Advertisement

Riding Gloves: రైడర్స్ గ్లోవ్స్ పెట్టుకుంటే ఇన్ని లాభాలున్నాయా? మీరూ అస్సలు మిస్సవ్వకండి!

Riding Gloves: రైడర్స్ గ్లోవ్స్ పెట్టుకుంటే ఇన్ని లాభాలున్నాయా? మీరూ అస్సలు మిస్సవ్వకండి!
Advertisement

ప్రయాణ సమయంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లాంగ్ రైడ్ కు వెళ్లే వాళ్లు హెల్మెట్లు, జాకెట్లు, బూట్లు లాంటివి ధరిస్తారు. వీటికి తోడుగా గ్లోవ్స్ అనేవి చాలా ముఖ్యం. భద్రత, సౌకర్యం సహా మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇంతకీ రైడర్లకు గ్లోవ్స్ ఎందుకు ముఖ్యం అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ప్రొటెక్షన్  

రైడింగ్ గ్లోవ్స్ రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు చేతులను రక్షించడంలో ఉపయోగపడుతాయి. యాక్సిడెంట్ వేళ చేతులు సహజంగానే శరీరాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ సమయంలో తీవ్రమైన గాయాలు కాకుండా కాపాడుతాయి. రైడింగ్ గ్లోవ్స్ చేతులు, మణికట్టును దెబ్బలు తగలకుండా కాపాడుతాయి.

⦿ మంచి గ్రిప్ కోసం   

Advertisement

రైడింగ్ గ్లోవ్స్ కేవలం రక్షణ కోసమే కాదు, బైక్ కంట్రోల్ ను కూడా పెంచుతాయి. గ్లోవ్స్ అరి చేతులు హ్యాండిల్‌ బార్లపై మంచి గ్రిప్ ను అందిస్తాయి. ఇందుకోసం ప్రత్యేకమైన పట్టును అందించే పదార్థాలతో తయారవుతాయి. తడి, పొడి పరిస్థితుల్లోనూ మంచి కంట్రోల్ ను అందిస్తాయి.

⦿ మంచి సౌకర్యం  

రైడింగ్ గ్లోవ్స్ మంచి సౌకర్యం అందిస్తాయి. చాలా రైడింగ్ గ్లోవ్స్ వెంటిలేషన్ హోల్స్, మెష్ ప్యానెల్లతో వస్తాయి. ఇవి ఎయిర్ ఫ్లోను పెంచుతాయి. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో చేతులను చల్లగా ఉంచుతాయి. మరోవైపు, చల్లని వాతావరణంలో వెచ్చగా ఉంచుతాయి.

⦿ ఎండ నుంచి రక్షణ  

Advertisement

రైడింగ్ గ్లోవ్స్ ఎండ నుంచి కాపాడుతాయి. సూర్యుడి UV కిరణాలకు ఎక్కువసేపు పడటం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. గ్లోవ్స్ ఉండటం వల్ల హానికరమైన UV కిరణాల నుంచి రక్షించే అవకాశం ఉంటుంది.

⦿ మెరుగైన రైడింగ్ అనుభవం  

రైడింగ్ గ్లోవ్స్ భద్రత గురించి మాత్రమే కాదు, అవి మొత్తం రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. మంచి గ్లోవ్స్ సౌకర్యాన్ని పెంచుతాయి. అలసటను తగ్గిస్తాయి, రోడ్డు మీద దృష్టి పెట్టడానికి అనుమతిస్తాయి. ఇవి  బైక్‌ మీద ఎక్కువ నియంత్రణను ఇస్తుంది.

⦿ స్టైలిష్, ఫంక్షనల్ డిజైన్స్

రైడింగ్ గ్లోవ్స్ స్టైలిష్, ఫంక్షనల్ డిజైన్ తో ఆకట్ఉకుంటాయి. రకరకాల డిజైన్లు, రంగులు, మెటీరియల్స్ తో తయారు చేసిన గ్లోవ్స్ అందుబాటులో ఉన్నాయి.

Read Also: బైక్ ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుందా? జస్ట్ ఇలా చేస్తే కూల్ గా ఉంటుంది!

⦿ ఏ గ్లోవ్స్ ఎవరికి అనుకూలంగా ఉంటాయి?     

మన దేశంలో బెస్ట్ రైడింగ్ గ్లోవ్స్ కోసం చూస్తున్నప్పుడు, ఫిట్, మెటీరియల్, వెంటిలేషన్, రక్షణ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. బెస్ట్ గ్లోవ్స్ బిగుతుగా లేకుండా కంఫర్ట్ గా ఉండే గ్లోవ్స్ ను తీసుకోవాలి. అధునాతన రక్షణ, మన్నిక, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని  గ్లోవ్స్ తీసుకోవాలి.

Read Also:  ఎలక్ట్రిక్ రోడ్లు వచ్చేస్తున్నాయ్, దానిమీద వెళ్తే ఆటోమేటిక్ గా ఈవీలు ఛార్జింగ్ అవుతాయి!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×