E-Paper
Advertisement

Swayambhu Movie: నాది ఏఐ సినిమా కాదు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నిఖిల్!

Swayambhu Movie: నాది ఏఐ సినిమా కాదు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నిఖిల్!
Advertisement

Swayambhu Movie: నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha).. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు తన నటనతో పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన నిఖిల్.. ఆ తర్వాత చేసిన 18 పేజీస్ , స్పై సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి ..ఇప్పుడు మళ్లీ ‘స్వయంభు’ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పైగా ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు నిఖిల్. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha menon) హీరోయిన్గా నటిస్తోంది.

హెచ్డి క్వాలిటీతో మళ్లీ రిలీజ్ చేసిన స్వయంభూ టీజర్..

హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇటీవల షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సంయుక్త.తో పాటు నభా నటేష్ (Nabha Natesh) కూడా హీరోయిన్గా నటిస్తోంది.. ఇందులో సుందరవల్లి అనే పాత్రలో నటిస్తున్నట్లు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . దీనికి తోడు ఇటీవల నభా నటేష్.. స్వయంభు సినిమా టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ కు అభిమానులకు కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించగా.. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.

మా సినిమాకి ఏఐ వాడలేదు..

Advertisement

ఇకపోతే ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల చేయగా.. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కొందరు టీజర్ క్వాలిటీ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.. హెచ్డి క్వాలిటీ తో రిలీజ్ చేయండి అంటూ కామెంట్లు కూడా చేశారు. ఇక టెక్నికల్ ఇష్యూ వల్ల టీజర్ క్వాలిటీ తగ్గిందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. దీనికి తోడు హెచ్డి క్వాలిటీతో టీజర్ ను మళ్ళీ అప్లోడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హీరో నిఖిల్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఇలా రాసుకు వచ్చారు. నిఖిల్.. “యూట్యూబ్.. ఎందుకు ఇలా గ్లిచ్ చేస్తుంది భయ్యా..ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల లాగా మా స్వయంభూ సినిమాలో ఎలాంటి ఏఐ వాడలేదు” అని పోస్ట్ షేర్ చేశాడు నిఖిల్.. ఇక నిఖిల్ ఈ పోస్టు పెట్టడంతో ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ షేర్ చేశాడు? అంటూ నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు.

ALSO READ:Vishwambhara: విశ్వంభర సినిమాపై అంచనాలు పెంచేసిన ప్రముఖ నిర్మాత!

నిఖిల్ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు..

Advertisement

ఇకపోతే కొంతమంది రాజాసాబ్ అని అంటుంటే.. మరి ఇంకొంతమంది ఇటీవల విడుదల చేసిన నాగబంధం టీజర్ గురించి అయ్యుంటుంది అంటూ ఎవరికి వారు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా ఆ సినిమాల లాగా ఏఐ ఉపయోగించలేదు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్ కి ఈ స్వయంభూ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి..

Related News

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×