Mamitha Baiju : ‘ప్రేమలు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ మమిత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉంది. మలయాళం తో పాటుగా ఇతర భాషల్లో కూడా సినిమాలో చేస్తూ యువతని తన వైపు తిప్పుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో అరుదైన రికార్డు పడింది. ఏకంగా ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరి ప్రేక్షకుల మనసు దోచుకుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అసలు మమిత ఖాతాలో పడ్డ రేర్ రికార్డ్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మలయాళ కుట్టి మమిత ఖాతాలో అరుదైన రికార్డు పడింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, అలియా భట్ తర్వాత అరుదైన రికార్డ్ సాధించింది మమితా బైజు. ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ రూ.200 కోట్ల సినిమాలు అందించిన తొలి సౌత్ హీరోయిన్‌గా నిలిచింది.. ఒకే ఏడాదిలో దాదాపు మూడు సినిమాలు 200 కోట్లకు పైగా వసూలు అందుకోవడం మామూలు విషయం కాదు. మూడు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఈ అమ్మడు రికార్డు బ్రేక్ చేసింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇలాంటి రికార్డుని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు అంటూ ఈ వార్త విన్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి మమిత బైజు ఖాతాలో ఇలాంటి రికార్డు నమోదవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..
మలయాళ ముద్దుగుమ్మ మమిత సినిమాల విషయానికొస్తే.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది.. ప్రేమలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ యూత్ క్రష్ గా మారిపోయింది. క్యూట్ స్మైల్ తో అద్భుతమైన నటనతో అందరిని కట్టిపడేస్తుంది.. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జన నాయగన్ మూవీతో పాటుగా నిన్న వచ్చిన విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మమిత కు వరుస హ్యాట్రిక్ విజయాలు సొంతం అయ్యాయి. అన్ని సినిమాలు 200 కోట్లకు పైగా వసూల్ అవ్వడంతో ఆమెతో సినిమా కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.. మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి..