Vijay Rashmika: తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్నలకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో రూమర్లు, మరెన్నో అంచనాల మధ్య ‘గీత గోవిందం’ జోడీ నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26, 2026న విజయ్ దేవరకొండ తన చిరకాల మిత్రురాలు రష్మిక మందన్నను వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన హృదయపూర్వక సందేశం, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ తన పోస్ట్‌లో ప్రేమ కంటే ముందు వారి మధ్య ఉన్న స్నేహానికి, ఆత్మీయతకు పెద్దపీట వేశారు. “ఒకరోజు నాకు ఆమె జ్ఞాపకం వచ్చింది.. అది మామూలు జ్ఞాపకం కాదు. తను పక్కన ఉంటే నా రోజు పూర్తవుతుందనే నమ్మకం. నేను తినే భోజనం దగ్గర నుంచి నేను చేసే జిమ్ వర్కౌట్స్ వరకు.. ప్రతి పనిలోనూ ఆమె తోడుంటే ఆ కిక్కే వేరు అనిపించింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఆమె పక్కన ఉంటే చాలు ‘ఇదే నా ఇల్లు’ అనే ప్రశాంతత దొరుకుతుందని అర్థమైంది,” అంటూ తన భావాలను అక్షరబద్ధం చేశారు విజయ్.
విజయ్, రష్మికల ప్రయాణం ‘గీత గోవిందం’ సినిమాతో మొదలైంది. అప్పట్లోనే వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో వీరి బంధం మరింత బలపడింది. బయట కూడా వీరిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, ఒకరిపై ఒకరు గౌరవం ప్రదర్శించడం చూసి అభిమానులు ఎప్పుడో వీరిని జంటగా ఫిక్స్ అయిపోయారు. కానీ, ఎప్పుడూ తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించని విజయ్, నేరుగా పెళ్లి వార్తతోనే అందరినీ పలకరించారు. “నా ప్రాణ స్నేహితురాలిని.. నా భార్యను చేసుకున్నాను” అని విజయ్ చేసిన ప్రకటనతో టాలీవుడ్ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నటుడు తన మనసులోని మాటను ఇంత అందంగా చెప్పడం పట్ల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. “విజయ్-రష్మిక మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. నిజమైన ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఒకరి ఉనికిలో మరొకరు ప్రశాంతతను వెతుక్కోవడమేనని విజయ్ దేవరకొండ ఈ పోస్ట్ ద్వారా నిరూపించారు. ఒక సాధారణ స్నేహితురాలు తన జీవితానికి ‘హోమ్’ (ఇల్లు) ఎలా అయిందో ఆయన వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
One day, I missed her.
Missed her in a way that made me feel like my day would’ve been better if she were around.
Like my meals would’ve felt more wholesome if she were sitting across from me.
Like my workouts would’ve been more fun and less of a punishment if she were doing… pic.twitter.com/fy7umfHWjN— Vijay Deverakonda (@TheDeverakonda) February 26, 2026