E-Paper
Advertisement

‘సెకండ్ హ్యాండ్’ స్క్రిప్ట్‌తోనే సరిపెట్టుకుంటున్న రౌడీ స్టార్?

‘సెకండ్ హ్యాండ్’ స్క్రిప్ట్‌తోనే సరిపెట్టుకుంటున్న రౌడీ స్టార్?
Advertisement

‘Vijay Deverakonda: విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అంటూ వరుస సక్సెస్ లని చూసిన ఈ రౌడీ పేరు వింటే ఒకప్పుడు ఫుల్ వైబ్రేషన్స్ వచ్చేవి,ముఖ్యంగా ఈవెంట్లలో విజయ్ మాట్లాడే స్పీచులంటే యూత్ అంతా పడి చచ్చే వారు.కట్ చేస్తే సీన్ టోటల్ రివర్స్ అయిపోయింది.
వరుస డిజాస్టర్స్ ని ఫేస్ చేస్తున్న ఈ రౌడీ స్టార్‌కు సొంతంగా కథలు ఎంచుకునే సత్తా తగ్గిపోయిందా లేక డైరెక్టర్స్ ఈయన్ని ఒక ‘ఆల్టర్నేట్’ ఆప్షన్‌గా చూస్తున్నారా అనే డౌట్స్ ఇండస్ట్రీలో గట్టిగానే రైజ్ అవుతున్నాయ్.

జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ ?

Advertisement

విషయంలోకి వెళ్తే రీసెంట్ గా ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రాజెక్ట్ విజయ్ దగ్గరికి రావడం వెనుక తారక్ రిజెక్షన్ ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు.అవును ..ఈ స్క్రిప్ట్ మొదట గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కోసం రాసుకున్నదట. శౌర్యువ్ ఈ కథను పట్టుకుని తారక్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా, అందులో విషయం లేదని పసిగట్టిన ఎన్టీఆర్.. తన బిజీ షెడ్యూల్‌ను సాకుగా చూపి సున్నితంగా కథని తిరస్కరించాడని ఇన్ సైడ్ టాక్.

రామ్ చరణ్ వద్దనుకున్న కింగ్ డమ్

Advertisement

సాధారణంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఒక కథను రిజెక్ట్ చేశాడంటే అందులో కంటెంట్ ఎంత వీక్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, తారక్ ‘డస్ట్ బిన్’లో పడేసిన ఆ కథనే విజయ్ దేవరకొండ అద్భుతమైన స్క్రిప్ట్ అంటూ నెత్తిన పెట్టుకోవడమే ఇక్కడ ఆశ్చర్యం.అచ్చం ఇలాగే గౌతమ్ తిన్ననూరి సినిమా విషయంలోనూ జరిగింది. రామ్ చరణ్ వద్దనుకున్న పీరియాడిక్ డ్రామాను విజయ్ చేసే కింగ్ డమ్ లాంటి అట్టర్ ప్లాప్ ని తల మీద పెట్టుకున్నాడు.

కంటెంట్ లో దమ్ము లేకపోతె మాత్రం

ఇపుడు సరిగ్గా తారక్ వద్దన్న కథనే విజయ్ మళ్ళీ సినిమాగా చెయబోతున్నాడు ఇలా వరుసగా పెద్ద హీరోలు రిజెక్ట్ చేసిన ‘సెకండ్ హ్యాండ్’ కథలనే విజయ్ అధ్బుతం అంటూ నెత్తిన పెట్టుకోవడం చూస్తుంటే ఈ రౌడీ కెరీర్ అప్పుడే ఎండ్ కార్డ్ వేసుకోబోతుందా ఏంటి అన్న అనుమానాలు రాకుండా పోవు.నిజానికి తారక్ బాడీ లాంగ్వేజ్, విజయ్ బాడీ లాంగ్వేజ్ కి చాలా తేడా ఉంటుంది.అలాంటిది తారక్ కోసం రాసుకున్న పవర్‌ఫుల్ ఎమోషన్స్ విజయ్‌ ఎలా పలికిస్తాడు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.అయితే హీరో మారినందుకు దర్శకుడు స్క్రిప్ట్‌లో మార్పులు చేసినా, బేసిక్ కంటెంట్ లో దమ్ము లేకపోతె మాత్రం ఎన్ని ప్యాచ్ వర్కులు చేసినా నో యూజ్ అంటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.

అట్టర్ ప్లాపులని మూటగట్టుకున్న రౌడీ

సో ..’లైగర్’, ‘ఫ్యామిలీ స్టార్’కింగ్ డమ్ వంటి వరుస అట్టర్ ప్లాపులని మూటగట్టుకున్న రౌడీ ఇప్పటికైనా కొత్త సబ్జెక్ట్ ఎంచుకుంటే బాగుండు అంటూ అని బాధ పడిపోతున్నారు రౌడీ ఫ్యాన్స్.ఏది ఏమైనా ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ రౌడీకి ఇపుడు సెకండ్ హ్యాండ్ స్క్రిప్ట్ లతో సర్డుకుపోతున్నాడన్న మాట. చూడాలి మరి ప్రియురాలు రష్మికని పెళ్ళాడిన ఈ రౌడీకి ఈసారైనా కాలం కలిసివస్తుందో లేదో !

also read :‘ముసలి ప్రొడ్యూసర్.. యంగ్ హీరోయిన్.. మంచం కింద నేను’..ఆ రాత్రి జరిగిన సీక్రెట్ బయటపెట్టిన జేడీ.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×