E-Paper
Advertisement

Vijay – Rashmika: మూడు ముళ్ళు.. ఏడు అడుగులతో.. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విరోష్ జంట

Vijay – Rashmika: మూడు ముళ్ళు.. ఏడు అడుగులతో.. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విరోష్ జంట
Advertisement

Vijay – Rashmika:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత ఎనిమిది సంవత్సరాలుగా మోస్ట్ రూమర్డ్ లవ్లీ జంటగా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna). 2018లో పరుశురాం రచన, దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ‘గీతాగోవిందం’ సినిమాలో తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. పైగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మళ్లీ 2019లో ‘డియర్ కామ్రేడ్’ సినిమా వచ్చి ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. అప్పటినుంచి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మధ్య ఏదో సాగుతోంది అనే వార్తలు గట్టిగా వినిపించాయి. ఇక ఆ వార్తలను రహస్యంగా మైంటైన్ చేస్తూ వచ్చిన ఈ జంట గత 4 రోజుల క్రితం అధికారికంగా ప్రకటించి, వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నామని స్పష్టం చేశారు.

పెళ్లి చేసుకున్న విరోష్ జంట..

ఇక ఎట్టకేలకు రాజస్థాన్లోని జైపూర్ లో ఉదయపూర్ ప్యాలెస్ వేదికగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మూడు ముళ్ళు.. ఏడడుగులు వేసి కొత్త బంధంలోకి అడుగు పెట్టారు. దాదాపు 8 సంవత్సరాలుగా ఊరిస్తూ ప్రేక్షకులలో ఉత్కంఠ రేపిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి అభిమానులను ఖుషీ చేశారు. ఇక ఈ జంటకు అటు పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆటపాటలతో హోరెరెత్తిన ప్రాంగణం..

Advertisement

ఇకపోతే విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంటకు అభిమానులు “విరోష్” అని అభిమానంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ పేరును వీరు స్వాగతిస్తూ “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అంటూ తమ వివాహ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పైగా “విరోష్ ప్రీమియర్ లీగ్” అంటూ ఈ వివాహ వేడుకకు వచ్చిన సన్నిహితులతో క్రికెట్ గేమ్ కూడా ఆడారు.. ఇక నిన్న అట్టహాసంగా సంగీత్ , హాల్దీ వేడుకలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని డాన్స్ చేస్తూ అందరిని సంతోషపరిచారు. ఇక అంతేకాదు ఈ వివాహ వేడుకకు హాజరైన బంధుమిత్రులు, సన్నిహితుల కోసం జపనీస్ వంటకాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ALSO READ:Varanasi film : భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోతుంది.. ప్రియాంక చోప్రా కామెంట్స్!

హాయ్ ప్రొఫైల్ మ్యారేజెస్ లలో ఒకటిగా..

Advertisement

ఇటీవల జరిగిన హై ప్రొఫైల్ వివాహాల లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి కూడా ఒకటి కావడం గమనార్హం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఉదయపూర్ వేదికగా హై ప్రొఫైల్ వివాహాలకు ఆతిథ్యం ఇస్తున్న హోటల్లోనే వీరిద్దరి వివాహం చేసుకొని తమ బంధువులకు ఆతిథ్యం అందించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ హ రష్మిక మందన్న పెళ్లి కోసం ఎదురుచూసిన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ లభించడమే కాకుండా పెళ్లి బంధంతో ఒక్కటై అభిమానులను సంతోషపరిచారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×