E-Paper
Advertisement

Romantic Movie OTT : ఈత కొడుతూ సీదా మొసలి నోట్లోకి… ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Romantic Movie OTT : ఈత కొడుతూ సీదా మొసలి నోట్లోకి… ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Romantic Movie OTT : ఈ సంవత్సరం ప్రేమికుల దినోత్సవం రోజు, ఒక సర్వైవల్ థ్రిల్లర్ థియేటర్లలోకి వచ్చింది. హిందీలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే అభిమానులు ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రన్ లో ఉండగానే ఓ ప్రముఖ ఓటీటీ దీని స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలోకి వస్తుందంటే

షానయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ పేరు ‘తు యా మెయిన్’ (Tu Yaa Main). బెజోయ్ నంబియార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 13న విడుదలైంది. ఆనంద్ ఎల్ రాయ్ దీనిని నిర్మించారు. ఇక దీని స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ పొందింది. అయితే రిలీజ్ తేదీని అధికారికంగా నిర్ధారించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందని మనం ఆశించవచ్చు

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక పేద రాపర్ (ఆదర్శ్ గౌరవ్), ఒక సోషల్ మీడియా స్టార్ (శనయ కపూర్) కలిసి ఒక వీడియో సాంగ్ షూటింగ్ కోసం ఒక పాడుబడిన రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ ఎవరూ లేని సమయంలో, అనుకోకుండా ఒక 20 అడుగుల లోతు ఉన్న ఖాళీ స్విమ్మింగ్ పూల్‌లో ఇద్దరూ పడిపోతారు. పైకి రావడానికి ఏ దారీ ఉండదు, ఫోన్ సిగ్నల్ కూడా దొరకదు. అసలే ఆకలి, దప్పికతో అల్లాడిపోతుంటే, పైగా వాళ్లకు తోడుగా ఆ పూల్‌లోకి ఒక క్రూరమైన మొసలి కూడా వస్తుంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ ఇద్దరూ కలిసి పోరాడాల్సి వస్తుంది. మొదట్లో ఒకరంటే ఒకరికి పడకపోయినా, చావు కళ్లముందు కనిపిస్తున్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటారు. సినిమా క్లైమాక్స్ వరకు వీళ్లు బతుకుతారా ? అనే టెన్షన్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. చివరికి ఆ మొసలి బారి నుండి వీళ్ళు తప్పించుకుంటారా ? దానికి బలవుతారా ? అనే విషయాలను మాత్రం, ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను చూసి తెలుసుకోండి.

Read Also : ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోకి రానున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఇవే… అక్యూస్డ్ నుండి ది కేరళ స్టోరీ 2 వరకు

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×