Varanasi film :గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమను తన పర్ఫామెన్స్ తో శాసించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్ ని వదిలి హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు అక్కడ కష్టపడి.. నేడు అక్కడే సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఒక్కో సినిమాకు 45 నుండి 50 కోట్ల మేరా రెమ్యూనరేషన్ అందుకుంటూ హీరోల రేంజ్ లో బిజీగా మారిన ప్రియాంక చోప్రా తాజాగా తెలుగులో రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’ సినిమాలో నటిస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu) హీరోగా నటిస్తున్నారు. మలయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇందులో కుంభ అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఒకవైపు గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మైథిలాజికల్ టచ్ కూడా ఉన్న విషయం అందరిలో ఆసక్తిని పెంచేసింది. ఇలాంటి సమయంలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా అంతర్జాతీయ వేదికపై మెరిసిన ప్రియాంక చోప్రా వారణాసి గురించి మాట్లాడుతూ..” సినిమా చూసినంతసేపు మనం కాలంలో ప్రయాణిస్తాం.. ప్రపంచాన్ని చుట్టేస్తాం.. ఇదొక గొప్ప సాహసం. ఈ సినిమా చాలా కూల్ గా ఉండబోతుందని నేను భావిస్తున్నాను. ఒకరకంగా చెప్పాలి అంటే భారతీయ సినిమా చరిత్రలో ఇదొక నిర్వచనంలా నిలిచిపోతుంది” అంటూ ప్రియాంక చోప్రా కామెంట్లు చేసింది. ఇక రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్డం కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఒక సునామీ సృష్టించవచ్చు అని ప్రియాంక మాటల్లో చెప్పకనే చెప్పేసింది ఇక మొత్తానికైతే వారణాసిపై ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:The Kerala story: కేరళ స్టోరీ కల్పితం కాదు నిజమే అంటున్న బాధితురాలు.. వీడియో వైరల్!
ఇకపోతే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి చెప్పుకొచ్చారు. కథలో భాగంగా టైం ట్రావెల్, వరల్డ్ టూర్ లాంటి ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని ఇప్పుడు ప్రియాంక చెప్పుకొచ్చింది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో.. ఇండియన్ ప్రమోషన్స్ తో రాజమౌళి ఈ విజువల్ వండర్ ను సిద్ధం చేస్తున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికైతే ప్రియాంక మాటలతో ఈ ప్రాజెక్టుపై ఉన్న క్రేజ్ ఇప్పుడు రెట్టింపు అయిందని చెప్పాలి శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై సుమారుగా 1200 కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.. పైగా మహేష్ బాబు ఇందులో ఐదు భిన్నమైన పాత్రలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రుద్ర, రాముడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.