E-Paper
Advertisement

Jagan Politics: జగన్ టీమ్‌లోకి ఇద్దరు యోధులు? కూటమి ప్రభుత్వానికి కష్టాలు తప్పవా?

Jagan Politics: జగన్ టీమ్‌లోకి ఇద్దరు యోధులు? కూటమి ప్రభుత్వానికి కష్టాలు తప్పవా?
Advertisement

Jagan Politics: వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారా? ఇకపై కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయనున్నారా? ఇద్దరు యోధులు జగన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారా? ఆ ఇద్దరి నేతలపై వైసీపీ నేతలు ఎందుకు చర్చించుకుంటున్నారా? రానున్న రోజుల్లో కూటమి సర్కార్ ఎలాంటి ఇబ్బందులు తప్పవు? వాటిపై ఆ పార్టీ నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు.

జగన్ టీమ్‌లోకి ఉండవల్లి-సుబ్రహ్మణ్యస్వామి

Advertisement

నార్మల్‌గా వైసీపీ ప్రణాళికలు ఎవరికీ అర్థం కావు. ముఖ్యంగా ఆ పార్టీలోని నేతలకు ఒక పట్టాన అర్థం కావని కొందరు చెప్పుకుంటారు. వారిది ఒక్కటే కాన్సెప్ట్. ప్రతీది నెగిటివ్ కోణంలో చూపించడమే వారి ప్రధాన అస్త్రం. గడిచిన రెండేళ్లుగా అదే చేసింది. దాని నుంచి ఎలాంటి ఫలితాలు రాలేదు. దీంతో కొత్త కొత్త అస్త్రాలను బయటకు తీసింది వైసీపీ.

ఏపీలోకి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లు కానుంది. గడిచిన రెండేళ్లుగా కూటమిని విడగొట్టటానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది.. చేస్తోంది జగన్ అండ్ కో టీమ్. తొలుత కీలక నేతల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది. ఓవైపు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, మరోవైపు పవన్ డమ్మీ అయిపోయారంటూ ప్రచారం చేసింది. వాటిని కూటమి పెద్దలు తిప్పికొట్టారు.

Advertisement

కోర్టుల ద్వారా కేసులు, ఇంకోవైపు పాస్టర్ వ్యవహారం?

ఆ తర్వాత సీనియర్ నేతలను మధ్య విభజన రేఖ గీసింది. అది కూడా ఫెయిలైంది. చివరకు కేడర్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడంతో కూటమి నేతలకు ముందుగానే పసిగట్టారు. దీంతో ఇటు చంద్రబాబు.. అటు పవన్ కల్యాణ్.. మరోవైపు బీజేపీ కీలక నేతలు కూడా కేడర్‌తో ఇప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించడంతో వైసీపీ ఉలిక్కిపడింది.

ఈసారి మరో అస్త్రాన్ని విరుసుతోంది. అందుకోసం ఇద్దరు నేతలను రంగంలోకి దించింది. ఒకరు ఉండవల్లి అరుణ్‌కుమార్, మరొకరు సుబ్రహ్మణ్యస్వామి. వీరి మధ్య ఎలాంటి మాటలు జరిగిందో తెలీదుగానీ ఓ వైపు ఉండవల్లిని, మరోవైపు స్వామిని రంగంలోకి దింపింది. తిరుమల కల్తీ నెయ్యి విషయంలో వీరిద్దరు డ్యామేజ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ALSO READ:  బ్రహ్మంగారిమఠం నూతన శకం.. రేపే శ్రీ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం

సుప్రీంకోర్టులో వారికి వ్యతిరేకంగా రావడంతో ఇప్పుడు కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఈ క్రమంలో ఉండవల్లి పాస్టర్ ప్రవీణ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఆయన సిద్దమవుతున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.  ఇక రెండోవైపు రాజధాని అమరావతి విషయంలో స్వామిని రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల వెనుక స్వామి ప్రమేయముందని అంటున్నారు. ఈ రెండు విషయాలు కనెక్ట్ అయితే కూటమి ప్రభుత్వానికి కష్టాలు మొదలవ్వడం ఖాయమని వైసీపీ నేతల మాట. కాపుల విషయంలో పవన్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే పనిలో అంబటి-పేర్ని- బొత్సలను రంగంలోకి దింపిందట ఆ పార్టీ హైకమాండ్.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×