BigTV English

Vijay – Rashmika: సీక్రెట్ గా విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్

Vijay – Rashmika: సీక్రెట్ గా విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్

Vijay rashmika : గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ లో ఉన్నారు అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ లో చాలా సందర్భాల్లో కనిపించారు. అయితే ఎప్పుడూ కూడా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయటకు చెప్పలేదు. కానీ వీళ్లు వేరువేరుగా ఒకే లొకేషన్ లో దిగిన ఫోటోలతో చాలామందికి ఒక అవగాహన వచ్చేసింది.


వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు. గీత గోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఆ సినిమా. వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అఫీషియల్ గా బయట పెడతారు అని చాలా రోజులుగా ఆడియన్స్ ఎదురు చూశారు.

ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత చెబుదాం అనే ప్లానింగ్ లో ఉన్నారు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది.


మొత్తానికి బయటపడ్డారు

విజయ్ దేవరకొండ చేసిన సినిమాల సక్సెస్ గురించి పక్కన పెడితే, బహుశా ఇంకా ఎన్ని రోజులు ఈ విషయాన్ని సాగదీస్తాం అని అవగాహన వచ్చే ఉంటుంది. అందుకే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ జంట గుడ్ న్యూస్ చెప్పేశారు. వీరిద్దరూ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు విశ్వసినీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఈరోజే వీళ్ళ నిశ్చితార్థం జరిగింది.

నిశ్చితార్థం జరిగింది అని వార్తలు వస్తున్నాయి గాని వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. చాలా సీక్రెట్ గా వీళ్ళు నిశ్చితార్థ వేడుక జరిగిపోయింది. మరికొద్ది సేపట్లో అధికారకంగా ప్రకటించనున్నారు అని తెలుస్తుంది.

ఫుల్ స్వింగ్ 

మరోవైపు రాహుల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కూడా రష్మిక (rashmika) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాయలసీమ ప్రాంతపు యాసను విజయ్ దేవరకొండ మాట్లాడనున్నాడు. రాహుల్, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన టాక్సీవాలా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.

మరోవైపు రష్మిక కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను చేస్తుంది. సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను రేపు అనౌన్స్ చేయనున్నారు.

Also Read: The Raja Saab: పక్కా ప్లానింగ్ తో ప్రభాస్ మూవీ, మారుతి ది మామూలు స్పీడ్ కాదు

Related News

NBK 111: మరోసారి ద్విపాత్రాభినయంలో బాలయ్య..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

MSVPG: చిరంజీవితో ఢీ కొట్టబోతున్న నాని విలన్.. అనిల్ స్కెచ్ మామూలుగా లేదే?

Sreeleela: ఆ సినిమా నుంచి జాన్వీ కపూర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల!

The Raja Saab: పక్కా ప్లానింగ్ తో ప్రభాస్ మూవీ, మారుతి ది మామూలు స్పీడ్ కాదు

Ramgopal Varma: రిషబ్ శెట్టిను చూసి సిగ్గు తెచ్చుకోండి.. వర్మ సంచలన పోస్ట్!

Mega158 : బాబీ, చిరంజీవి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

Rashmika -Vijay Devarakonda: కలిసి దసరా జరుపుకున్న విజయ్ రష్మిక.. రిలేషన్ పై క్లారిటీ ఇవ్వచ్చుగా?

Big Stories

×