2వేల నోట్ల రూపాయలను భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితమే రద్దు చేసింది. ఎవరి దగ్గరైనా ఆ నోట్లు ఉంటే అప్పట్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాదాపుగా అందరూ డిపాజిట్ చేశారు. 98.35శాతం నోట్లు తిరిగి ఆర్బీఐకి చేరుకున్నాయి. మరి మిగతా నోట్ల సంగతేంటి? ఆ నోట్లను ఎవరు ఎందుకు తమ వద్ద పెట్టుకున్నారు. కారణాలేవైనా వాటిని తిరిగి ఆర్బీఐకి అప్పగించాలంటూ తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
తిరిగి ఇచ్చేయండి..
2వేల రూపాయల నోట్లు చెలామణిలో లేవు. అంటే వాటిని ఉపయోగించి మనం ఏ వస్తువుని కొనలేం, అలాగని నేరుగా బ్యాంకులో కూడా డిపాజిట్ చేయలేం. రద్దు చేసిన తర్వాత కొంతకాలం మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటుని ఆర్బీఐ కల్పించింది. తర్వాత ఆ అవకాశాన్ని కూడా ఉపసంహరించుకుంది. ఆ గడువు 2023 అక్టోబర్ 7 తో ముగిసిపోయింది. ఆ తర్వాత దాదాపుగా అందరూ 2వేల నోట్లను మరచిపోయారు. ఇక ఎవరి వద్ద కూడా ఆ నోట్లు లేవనే అనుకున్నారు. కానీ ఉన్నాయి. ప్రభుత్వం నోట్లను ఉపసంహరించుకునే నాటికి ఆ నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్ల రూపాయలు. వాటిలో 98.35 శాతం నోట్లు తిరిగి ఆర్బీఐకి చేరుకున్నాయి. ఇంకా 1.65 శాతం నోట్లు జనం వద్ద ఉన్నాయి. వాటి విలువ 5884 కోట్ల రూపాయలు. ఆ నోట్లను తిరిగి ఆర్బీఐ సేకరించాలనుకుంటోంది. అందుకే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read: టాటా సుమో రీఎంట్రీ.. 2025 మోడల్‌లో ఏం కొత్తగా వచ్చాయో తెలుసా?
2వేల నోట్లను ఏం చేయాలి?
మీ వద్ద ఇంకా 2వేల రూపాయల నోట్లు ఉంటే మాత్రం.. వాటిని మార్చుకోడానికి ఇంకో ఆఖరి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని నోటిఫికేషన్ రూపంలో విడుదల చేసింది ఆర్బీఐ. ఇప్పటికీ మీ వద్ద 2వేల నోట్ల రూపాయలు ఉంటే అధికారికంగా వాటిని మార్పిడి చేసుకోవచ్చు. ఆ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 19 ప్రాంతీయ కార్యాలయాలలో మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. ఆయా కార్యాలయాలలో నేరుగా నోట్లను డిపాజిట్ చేయడానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఆ కార్యాలయాలకు వెళ్లడానికి అవకాశం లేకపోతే, పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా వాటిని RBI కార్యాలయాలకు పంపించవచ్చు. అలా పంపిస్తే, సదరు ఖాతాదారుడు కోరిన బ్యాంక్ అకౌంట్లో ఆ నగదుకి సరిపడా సొమ్ముని ఆర్బీఐ డిపాజిట్ చేస్తుంది. అయితే ఇదే ఆఖరి అవకాశమా, లేక ఇంకా ఈ అవకాశం ఉంటుందా అనేది స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్లో చివరి తేదీని ప్రకటించలేదు. అంటే ఈ అవకాశాన్ని మరికొన్నాళ్లు పౌరులు ఉపయోగించుకోవచ్చనమాట.
Also Read: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్.. కేవలం రూ.155కే అపరిమిత కాల్స్!
ఆ తేడా మీకు తెలుసా?
2వేల రూపాయల నోటు ఇంకా చట్టబద్ధమైన ద్రవ్యంగానే ఉంది. అంటే 2వేల రూపాయల నోటు విలువ సున్నాకి చేరలేదు. దానికి విలువ ఉంది. అయితే ఆ విలువను మనం సాధారణ మార్కెట్ లో మార్చుకోలేం. అలాగని, బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేం. కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే వాటిని మార్చుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకండి, 2వేల రూపాయల నోటు చట్టబద్ధమైన ద్రవ్యంగా ఉన్నప్పుడే వాటిని మార్చుకోండి.