BigTV English

The Raja Saab: పక్కా ప్లానింగ్ తో ప్రభాస్ మూవీ, మారుతి ది మామూలు స్పీడ్ కాదు

The Raja Saab: పక్కా ప్లానింగ్ తో ప్రభాస్ మూవీ, మారుతి ది మామూలు స్పీడ్ కాదు

The Raja Saab: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద పంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నాడు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు గుర్తింపు తీసుకొచ్చింది. అయితే బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ప్రభాస్ అన్ని సీరియస్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. కానీ బుజ్జిగాడు, డార్లింగ్ వంటి సినిమాల్లో ప్రభాస్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. మరోసారి ఆ కామెడీ టైమింగ్ బయటకు తీసే ప్రయత్నం చేశాడు మారుతి.


 

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ మరియు ట్రైలర్ కూడా విడుదల అయిపోయాయి. సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నారు. జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించారు. గతంలో ఇదే సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశారు.


స్పీడ్ పెంచిన మారుతి 

ఈ సినిమా ప్రస్తుతం తుది దశలో ఉంది. ఈరోజు నుంచి ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. మొత్తానికి ప్రభాస్ తో ఒక ప్రాజెక్టు చేస్తే చాలా మంది సంవత్సరాలు తరబడి చేస్తారు. కానీ మారుతి మాత్రం చాలా స్పీడ్ గా ప్రాజెక్టు పూర్తి చేశాడు అని చెప్పాలి.

ప్రభాస్ ను రాజా సాబ్ సినిమాలో చాలా అందంగా చూపించాడు మారుతి. ఇది చూసిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది అని చెప్పాలి. అలానే ట్రైలర్లో కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంది సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

100% సక్సెస్ 

మారుతి విషయానికి వస్తే ఇప్పటివరకు తాను చేసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయితే కాలేదు. మంచి సక్సెస్ రేట్ మారుతి సినిమాలకు ఉంది. అది కూడా ప్రభాస్ అభిమానులకు కొంతమేరకు పెంచుతుంది. ఆడియన్స్ పల్స్ పిలిచిన అతి తక్కువ మంది దర్శకులలో మారుతి కూడా ఒకడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయితే మంచి కలెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అలానే సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది.

ఇక ఈ ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి మంచి గుర్తింపు తెస్తుంది అని నిర్మాతలు కూడా ఆశిస్తున్నారు. దాదాపు 50 సినిమాలు ఆ సంస్థ నిర్మిస్తున్న కూడా గట్టిగా చెప్పుకోవడానికి ఒక సినిమా కూడా లేదు అనేది వాస్తవం. బహుశా రాజా సాబ్ సినిమాతో ఆ బ్యానర్ కి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

Also Read: Mega158 : బాబీ, చిరంజీవి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

Related News

NBK 111: మరోసారి ద్విపాత్రాభినయంలో బాలయ్య..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

MSVPG: చిరంజీవితో ఢీ కొట్టబోతున్న నాని విలన్.. అనిల్ స్కెచ్ మామూలుగా లేదే?

Sreeleela: ఆ సినిమా నుంచి జాన్వీ కపూర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల!

Ramgopal Varma: రిషబ్ శెట్టిను చూసి సిగ్గు తెచ్చుకోండి.. వర్మ సంచలన పోస్ట్!

Mega158 : బాబీ, చిరంజీవి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

Rashmika -Vijay Devarakonda: కలిసి దసరా జరుపుకున్న విజయ్ రష్మిక.. రిలేషన్ పై క్లారిటీ ఇవ్వచ్చుగా?

Ramcharan -Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్..మెగా వారసుడు రాబోతున్నాడా?

Big Stories

×