ఆపరేషన్ సిందూర్ 2.ఓ కూడా ఉంటుందని ఆమధ్య భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఆ హెచ్చరికలను మరోసారి తనదైన శైలిలో వినిపించారు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం కనిపించకుండూ పోతుందని అన్నారు. భారత్ ని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని, భారత దృఢ సంకల్పాన్ని పరీక్షించుకోవాలని అనుకోవద్దని పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు. అలా చేయాలని చూస్తే పాకిస్తాన్ ప్రపంచంలో భాగంగా ఉండదని అన్నారాయన.
ఇంకోసారి రిపీట్ అయితే..
భారత్ తనకు తానుగా ఎప్పుడూ పాక్ జోలికి పోలేదు. ఒకవేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం భారత్ ఊరికే వదిలిపెట్టలేదు. పహల్గాం అటాక్ తర్వాతే భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టింది. అప్పుడు కూడా పాక్ లోని ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసింది. జనావాసాలను ఏమాత్రం టచ్ చేయలేదు. ఉగ్ర శిబిరాలను కూలగొట్టిన అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ కి విరామం ఇచ్చింది. ఇంకోసారి అలాంటి పరిస్థితులు రిపీట్ అయితే ఆపరేషన్ సిందూర్ 1.0 లాగా ఈసారి భారత్ సంయమనం పాటించదని, ఈసారి ఆపరేషన్ సిందూర్ 2.0 చూస్తారని హెచ్చరించారు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.
ఈసారి మరింత భయానకంగా..
రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన జనరల్ ద్వివేది, సైనికులు అప్రమత్తంగా ఉండాలని, ఆపద సమయంలో ఐక్యంగా పోరాడాలని సూచించారు. శ్రీగంగానగర్ జిల్లాకు వెళ్లిన ఆయన.. పాకిస్తాన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారతదేశం యొక్క దృఢ సంకల్పాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని కూడా హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ పై ఉగ్రవాద దాడి జరిగింది. ఆ దాడిలో భారతీయ పౌరులతో పాటు ఒక నేపాలీ కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ మొదలైంది. పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని భారత్ బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ కూడా ఫైటర్ జెట్ లతో రెచ్చిపోయింది. భారత వైమానిక దళం పాక్ కి చెందిన 5 ఫైటర్ జెట్స్ ని కూల్చేసింది. డ్రోన్లను కూడా అంతం చేసింది. దీంతో పాక్ తోకముడిచింది. మన టార్గెట్ కేవలం పాక్ లోని ఉగ్రవాద శిబిరాలు కాబట్టి.. అవి ధ్వంసం అయిన తర్వాత భారత్ శాంతించింది. అయితే పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. అయితే ఈసారి భారత మాత్రం మునుపటిలా శాంతిమంత్రం పాటించదని అంటున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఈసారి ఆపరేషన్ సిందూర్ 2.0 భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు.
Also Read: ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
వారికి సన్మానం..
ఆపరేషన్ సిందూర్ లో అద్భుత ధైర్య సాహసాలు చూపించిన సైనికులను జనరల్ ద్వివేది సన్మానించారు. BSF 140వ బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ ప్రభాకర్ సింగ్, రాజ్‌పుతానా రైఫిల్స్‌కు చెందిన మేజర్ రితేష్ కుమార్, హవల్దార్ మోహిత్ గెరాను సత్కరించారు. ఆపరేషన్ సిందూర్‌లో వారు అద్భుతమైన పాత్ర పోషించారని అన్నారు.
Also Read: 2 గంటలు ఇంటర్నెట్ బంద్, రోడ్లపైకి పోలీసు బలగాలు..