E-Paper
Advertisement

IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు.. మంచి వేతనం, డోంట్ మిస్

IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు.. మంచి వేతనం, డోంట్ మిస్
Advertisement

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఈ మేరకు 1,300 ఖాళీల భర్తీ కోసం అధికారికంగా షార్ట్ ప్రకటన విడుదల చేసింది. వీటిలో అసిస్టెంట్‌ మేనేజర్‌ (గ్రేడ్‌-ఏ) తో పాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌ (గ్రేడ్‌-ఓ) పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వివరాలు..

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 200 అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌-ఏ పోస్టులు ఉండగా.. మిగిలిన 1,100 పోస్టులు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ‘ఓ’ కేటగిరీకి చెందినవి. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు.

విద్యార్హతలు:

Advertisement

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగనుంది. తొలుత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ రెండు దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.

ముఖ్యమైన తేదీల వివరాలు:

అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీన ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 19 చివరి తేదీగా నిర్ణయించారు.

గడువు తక్కువగా ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ముందే సిద్ధం కావాలని బ్యాంక్ వర్గాలు సూచించాయి. మరిన్ని వివరాల కోసం ఐడీబీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.idbi.bank.in/

ALSO READ: DSSSB Recruitment: అక్షరాల రూ.1,51,000 జీతం.. డిగ్రీ అర్హతతో భారీగా జాబ్స్, పూర్తి వివరాలు ఇవే..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×