E-Paper
Advertisement

Vijay Deverakonda: పెళ్లికి పిలవచ్చుగా.. చిన్నారికి విజయ్ రిప్లయ్.. నెటిజన్లు ఫిదా!

Vijay Deverakonda: పెళ్లికి పిలవచ్చుగా.. చిన్నారికి విజయ్ రిప్లయ్.. నెటిజన్లు ఫిదా!
Advertisement

Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంట గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ, ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గత వారం పదిరోజులుగా ఈ జంట పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. వీరి పెళ్లి, రిసెప్షన్స్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. విరోష్ వెడ్డింగ్‌ (Virosh Wedding)ని పురస్కరించుకుని ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, రష్మికలకు చెందిన ఓ బుల్లి అభిమాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ చిన్నారి వీడియోకు స్వయంగా విజయ్ దేవరకొండ స్పందించడంతో.. ఆ పాప వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read- Allu Sirish: అతన్ని నేను చూడలేదు.. కానీ ఇలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు థాంక్స్.. అల్లు శిరీష్ ఎమోషనల్..!

మేము కూడా ఫ్యాన్సేగా..

Advertisement

అసలింతకీ చిన్నారి వీడియోలో ఏముందంటే.. ‘‘అందరినీ పెళ్లికి పిలిచి లడ్డూలు పంచారు, అన్నదానం చేశారు. మేం కూడా ఫ్యాన్సే కదా.. నేను కూడా రీల్సే చేస్తున్నాను కదా.. నన్ను కూడా పెళ్లికి పిలిస్తే ఏమవుతుందంట? ఈ వీడియోను విజయ్ దేవరకొండకు చేరే వరకు అందరూ షేర్ చేయండి’’ అంటూ చిన్నారి ఈ వీడియోలో.. తన తియ్యటి మాటలతో ఆకట్టుకుంది. ఈ వీడియోపై పలువురు పలు రకాలుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి చిన్న పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం ‘ఆ పాప చెబుతున్న దానిలో కూడా వాస్తవం ఉంది కదా’ అంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అలా ఈ వీడియో ఇప్పుడు విజయ్ దేవరకొండ వరకు చేరింది. వెంటనే ఆ పాపకు ఆయన రిప్లయ్ కూడా ఇచ్చారు.

Also Read- Nayanthara: ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఇక బాలీవుడ్‌లో నయన్‌కు తిరుగులేనట్టే!

మంచిగా తిందాము

Advertisement

‘‘బుజ్జితల్లి.. ఇంటికి పిలుస్తా లంచ్ కి. నీకు ఇష్టమైన ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు. అన్నీ ఇంట్లోనే చేయించుకుని మంచిగా తిందాము’’ అని విజయ్ ఆ పాప వీడియోకు కామెంట్ రూపంలో రిప్లయ్ ఇచ్చారు. అంతే ఆ పాప ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఆ పాప తల్లిదండ్రులు విజయ్ కామెంట్‌కు స్పందిస్తూ.. ‘మీ రిప్లయ్‌కి ధన్యవాదాలు. లక్కీ ఇది చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మీకు కృతజ్ఞతలు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ స్పందనకు సంబంధించి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుజ్జితల్లి అలా కోరిందో లేదో, ఇలా రియాక్ట్ అయ్యడు అన్న అంటూ వారు ఈ పోస్ట్‌లను వైరల్ చేస్తున్నారు. త్వరలోనే చిన్నారిని విజయ్ దేవరకొండ ఇంట్లో చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఒక చిన్నారికి ఇలా స్పందించి విజయ్ అందరి మనసులు దోచేశారని మాత్రం చెప్పుకోవచ్చు.

">

Also Read- Rashmika Mandanna: రాహులా.. అవార్డు కొట్టాం! గద్దర్ అవార్డ్‌పై రష్మిక

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×