E-Paper
Advertisement

Allu Sirish: అతన్ని నేను చూడలేదు.. కానీ ఇలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు థాంక్స్.. అల్లు శిరీష్ ఎమోషనల్..!

Allu Sirish: అతన్ని నేను చూడలేదు.. కానీ ఇలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు థాంక్స్.. అల్లు శిరీష్ ఎమోషనల్..!
Advertisement

Allu Sirish: టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ ఇటీవల తన పెళ్లి తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తన దీర్ఘకాల స్నేహితురాలు నయనికా రెడ్డిను వివాహం చేసుకున్న అనంతరం, శిరీష్ ఒక అందమైన పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోతో పాటు తన మామగారిని గుర్తు చేసుకుంటూ హృదయానికి హత్తుకునే సందేశాన్ని కూడా రాశాడు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు మరియు సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలో అల్లు శిరీష్.. నయనికా రెడ్డి చాలా అందంగా, పద్ధతిగా కనిపించారు. నయనికా రెడ్డి గోల్డ్.. పింక్ కలర్ షేడ్స్ ఉన్న సారీ ధరించింది. ఆమె అందమైన నగలు కూడా ధరించింది. మరోవైపు అల్లు శిరీష్ ఐవరీ రంగు శేర్వానీతో పాటు ధోతీ ధరించి ఆకట్టుకున్నాడు.

Advertisement

ఈ ఫోటోతో పాటు అల్లు శిరీష్ ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా రాశాడు. తన మామగారు డి. శరత్ చంద్ర రెడ్డి గురించి గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. తనకు ఆయనను ప్రత్యక్షంగా కలిసే అవకాశం రాలేదని చెప్పిన శిరీష్, కానీ తన భార్యను మంచి విలువలతో పెంచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు.

ఆయన్ని నేను కలవలేదు..!

Advertisement

“నా మామగారు డి. శరత్ చంద్ర రెడ్డి గారికి… ఆయనను వ్యక్తిగతంగా కలిసే అదృష్టం నాకు రాలేదు. కానీ ఇలాంటి మంచి అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చినందుకు.. అలాంటి అమ్మాయిని ప్రేమతో పెంచినందుకు ఆయనకు ధన్యవాదాలు. మీరు ప్రారంభించిన ఆ ప్రేమను నా జీవితాంతం ముందుకు తీసుకెళ్తాను,” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

అల్లు శిరీష్.. నయనికా రెడ్డి పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట 2023 నుంచి ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత 2025 అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. చివరకు 2026 మార్చి 7న వీరి వివాహం జరిగింది.

ఈ పెళ్లి వేడుకకు అల్లు శిరీష్ అన్న అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి హాజరయ్యాడు. అల్లు అర్జున్ సంప్రదాయ వేష్టీ ధరించగా, స్నేహా రెడ్డి లావెండర్ రంగు లెహంగా ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ALSO READ: Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై టెన్షన్.. రాజా సాబ్ తప్పులు రిపీట్ కానున్నాయా..!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×