E-Paper
Advertisement

Vijay Devarakonda: రౌడీ బాయ్ ముందు పెద్ద సవాల్.. రెండు యాసల్లో మాట్లాడనున్న విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda: రౌడీ బాయ్ ముందు పెద్ద సవాల్.. రెండు యాసల్లో మాట్లాడనున్న విజయ్ దేవరకొండ..
Advertisement

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కెరీర్‌లో కొన్ని కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాల్లో హైదరాబాద్ యాసే ఎక్కువగా వినిపించింది. అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది కూడా. కానీ ఇప్పుడు మాత్రం విజయ్ తన నటనలో మరో కొత్త ఛాలెంజ్‌ను స్వీకరించబోతున్నారు. రాబోయే సినిమాల్లో రెండు భిన్నమైన యాసల్లో డైలాగ్స్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు మాత్రమే కాదు..ఆయన అభిమానులకు కూడా ఆసక్తికరమైన విషయం.

రౌడీ బాయ్ ఇమేజ్ తో పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. ఆ ఇమేజ్‌కు హైదరాబాద్ యాస చాలా సెట్ అయింది. అయితే ఒకే తరహా యాసలోనే నటిస్తే నటుడిగా పరిమితమవుతానని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి తన కమ్ఫర్ట్ జోన్‌ను వదిలి కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.

Advertisement

మొదటి సినిమా రోడీ జనార్ధన. ఈ సినిమాలో విజయ్ గోదావరి ప్రాంత యాసలో మాట్లాడనున్నాడు. గోదావరి యాస చాలా మృదువుగా, భావోద్వేగంతో ఉంటుంది. ఆ యాసను సహజంగా పలకడం అంత సులువు కాదు. సరైన ఉచ్చారణ, మాటల తీరు చాలా ముఖ్యం. అందుకే విజయ్ ఈ యాస కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం. పాత్రకు తగ్గట్టుగా యాస రావాలంటే ఇది చాలా అవసరం.

ఇక మరో సినిమా వీడీ 14. ఈ సినిమాలో విజయ్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. రాయలసీమ యాసకు ఒక ప్రత్యేకమైన గంభీరత ఉంటుంది. ఆ యాసలో బలమైన పదాలు, గట్టిగా మాట్లాడే తీరు కనిపిస్తుంది. ఈ యాసను సరిగ్గా పలకకపోతే పాత్ర మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమాకు కూడా విజయ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Advertisement

ఒకే నటుడు రెండు వేర్వేరు ప్రాంతాల యాసల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు. ఇది విజయ్ దేవరకొండకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఆయన నటనకు కొత్త గుర్తింపు వస్తుంది. అదే సమయంలో ప్రేక్షకుల నమ్మకాన్ని కూడా మరింతగా గెలుచుకునే అవకాశం ఉంది. విజయ్ ఈ ఛాలెంజ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

ALSO READ: Allu Arjun -Sandeep Reddy: అల్లు ఫాన్స్ కిక్ ఇచ్చే న్యూస్..సందీప్ రెడ్డితో బన్నీ మూవీ ఫిక్స్

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×