E-Paper
Advertisement

Smartphone Price Hike: ఫోన్ ధరలు పెంచేసిన అన్ని కంపెనీలు.. మోటోరోలా మాత్రం ధర తగ్గింపు..

Smartphone Price Hike: ఫోన్ ధరలు పెంచేసిన అన్ని కంపెనీలు.. మోటోరోలా మాత్రం ధర తగ్గింపు..

Smartphone Price Hike| మార్చి 2026 నెలలో చాలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ధరలు పెంచుతున్నాయి. కస్టమర్లు కొత్త స్టాక్ కొనాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని రిటటైలర్లు హెచ్చరిస్తున్నారు. కాంపోనెంట్ల (ఫోన్ విడిభాగాలు) ధరలు పెరగడం వల్ల కంపెనీలు ధరలు పెంచుతున్నాయి. కానీ మోటోరోలా మాత్రం వేరే మార్గం ఎంచుకుంది. రెండు పాపులర్ మోడల్స్ ధరలు తగ్గించింది. మార్చి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఒక పాపులర్ టిప్‌స్టర్ సోషల్ మీడియాలో ఈ విషయం షేర్ చేశాడు.

ధరలు పెంచిన బ్రాండ్స్ ఇవే

POCO, Redmi, Vivo, iQOO, Realme, Samsung, OnePlus వంటి దాదాపు అన్ని బ్రాండ్లు ధరలు పెంచాయి. ఒక్కసారిగా ధరల పెంపు జరగడంతో మధ్య తరగతి కస్టమర్లకు ఆర్థిక ఇబ్బంది భారం తప్పదు. ధరల పెరుగుదల వల్ల కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. ఈ సమయంలో మోటోరోలా ధరలు తగ్గించడం చాలా సంతోషకరమైన విషయం.

రెండు మోడల్స్ ధరలు తగ్గించిన మోటోరోలా

మోటోరోలా Edge 70 ధర రూ.3,000 తగ్గింది. గతంలో రూ.32,999 ఉండగా ఇప్పుడు రూ.29,999కి దొరుకుతోంది. Moto G67 Power ధర కూడా రూ.1,000 తగ్గింది. గతంలో రూ.17,999 ఉండగా ఇప్పుడు రూ.16,999 అయింది. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ధరలతో లిస్ట్ అయ్యాయి. మోటోరోలా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్ ఇష్టపడే వారికి ఈ వార్త ఊరటనిస్తోంది.

ధరలు పెరిగిన POCO మోడల్స్ ఇవే

POCO C75 బేస్ మోడల్ ధర రూ.8,499 నుంచి రూ.10,999కి పెరిగింది.
POCO M7 బేస్ మోడల్ రూ.11,499 నుంచి రూ.12,499 అయింది.
POCO C85 రూ.1,000 పెరిగింది.
POCO M7 Plus బేస్ వేరియంట్ రూ.13,999 అయింది. POCO F7 ధర కూడా రూ.2,000 పెరిగింది.

ధరలు పెంచిన Vivo, iQOO

Vivo T4x ధర రూ.2,500 వరకు పెరిగింది.
Vivo T4R ధర కూడా రూ.2,000 ఎక్కువ అయింది.
Vivo T4 ధర రూ.2,000 పెరిగింది.
iQOO Z10x ధర రూ.2,500 వరకు పెరిగింది.
iQOO Z10R, iQOO Z10 రెండూ రూ.2,000 ఎక్కువ అయ్యాయి.

మోటోరోలా Edge 70 గతంలో పెరిగిన ధర

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మోటోరోలా Edge 70 లాంచ్ అయిన తర్వాత రూ.3,000 ధర పెరిగింది. ఇంతకుముందు రూ.29,999 ఉండగా తర్వాత రూ.32,999 అయింది. ఇప్పుడు మళ్లీ రూ.29,999కి తగ్గించింది. ఇది కొంచెం గందరగోళం కలిగిస్తుంది కానీ ప్రస్తుతం కస్టమర్లకు మాత్రం లాభమే.

Also Read: 50 శాతం కరెంట్ బిల్లు ఆదా.. టాప్ రేటెడ్ 9kg వాషింగ్ మెషీన్లపై భారీ తగ్గింపు

OnePlus, Samsung ఫోన్స్ ధరలు కూడా పెరిగాయి

వన్‌ప్లస్ 15R మార్చి 1 నుంచి రూ.4,000 ఎక్కువ అవుతుంది. బేస్ వేరియంట్ ధర రూ.51,999 అయింది. శాంసంగ్ గెలాక్సీ A56 రూ.2,000 ధర పెరిగింది. గెలాక్సీ A36, గెలాక్సీ F17 5G కూడా ధరలు పెరిగాయి.

ఈ నెలలో చాలా బ్రాండ్లు ధరలు పెంచుతుంటే మోటోరోలా మాత్రం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర తగ్గించి కస్టమర్లకు ఊరిటనిచ్చింది. వాల్యూ ఫర్ మనీ కోసం చూస్తున్నవారు ఇప్పుడు మోటోరోలా ఫోన్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. మరిన్ని ధర మార్పులు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేయాలి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×