E-Paper
Advertisement

Vijay Rashmika: సొంత గ్రామానికి విజయ్ రష్మిక .. గ్రామస్తులందరికీ పసందైన భోజనం!

Vijay Rashmika: సొంత గ్రామానికి విజయ్ రష్మిక .. గ్రామస్తులందరికీ పసందైన భోజనం!
Advertisement

Vijay Rashmika: రష్మిక మందన్న (Rashmika Mandanna)విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) దాదాపు 8 సంవత్సరాల ప్రేమ బంధానికి గుడ్ బై చెబుతూ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఈ జంట ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వివాహం అనంతరం విరోష్ దంపతులు ఆలయాలను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మొదటిసారి తన భార్య రష్మిక మందన్నను తీసుకొని తన సొంత గ్రామానికి వెళ్లారు.. నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలంలో ఉన్న తుమ్మన్ పేట గ్రామంలో కొత్త జంట సందడి చేశారు. ఇలా విజయ్ దేవరకొండ తన భార్యతో కలిసి మొదటిసారి స్వగ్రామానికి వస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కొత్త జంటకు స్వాగతం పలికారు.

సత్యనారాయణ స్వామి వ్రతంలో కొత్త జంట..

రష్మిక మందన్న విజయ్ దేవరకొండను చూడటానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తరలివచ్చారు. ఊరేగింపుగా విజయ్ రష్మిక తమ ఇంటికి చేరుకున్నారు. ఇక ఇంటికి వెళ్ళగానే అక్కడ తులసి పూజ పూర్తయిన అనంతరం తన భర్తతో కలిసి రష్మిక అత్తారింట్లోకి అడుగు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నేడు తన సొంత గ్రామంలో రష్మిక విజయ్ దేవరకొండ సత్యనారాయణ స్వామి వ్రతం(Satyanarayana Swamy vratham) నిర్వహించిన సంగతి తెలిసిందే.

గ్రామ ప్రజలందరికీ భోజనం ఏర్పాట్లు..

Advertisement

రష్మిక విజయ్ వివాహ వేడుకలు చాలా సాంప్రదాయ బద్ధంగా జరిగాయి. ఇందులో భాగంగానే పెళ్లయిన వెంటనే ఈ కొత్త జంట హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ప్రస్తుతం ఈ వీడియోలో కూడా వైరల్ అవుతున్నది .ఇలా మొదటిసారి పెళ్లి చేసుకుని తన సొంత గ్రామానికి వచ్చిన నేపథ్యంలో గ్రామ ప్రజలందరికీ కూడా పసందైన భోజనాన్ని ఏర్పాట్లు చేశారు. వీరి పెళ్లి వేడుక సందర్భంగా విజయ్ తన గ్రామస్తులందరికీ నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్ తయారు చేయించి భోజనాలను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఆలయాలలో అన్నదానం..

Advertisement

ఇక ఈ జంట పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా పలు ఆలయాలలో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున స్వీట్స్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తన స్వగ్రామంలో కూడా భారీగా భోజనాలను ఏర్పాటు చేయించారు. ఇక నేడు ఈ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేయగా ఫిబ్రవరి 4వ తేదీ హైదరాబాదులో తిరిగి వెడ్డింగ్ రిసెప్షన్ ను నిర్వహించబోతున్నారు. తాజ్ కృష్ణ లో వివాహ రిసెప్షన్ వేడుక ఎంతో ఘనంగా జరగబోతుంది ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు, రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కలిసి ఈ జంట వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Also Read: Sreeja Konidela: దుబాయ్ లో చిక్కుకున్న మెగా డాటర్ శ్రీజ…సంచలనంగా మారిన పోస్ట్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×