E-Paper
Advertisement

PCB: ఒక్కో ప్లేయ‌ర్ రూ.50 ల‌క్ష‌లు జేబులోంచి క‌ట్టండి…పాక్ ప్లేయ‌ర్ల‌కు న‌ర‌కం చూపిస్తోన్న PCB

PCB: ఒక్కో ప్లేయ‌ర్ రూ.50 ల‌క్ష‌లు జేబులోంచి క‌ట్టండి…పాక్ ప్లేయ‌ర్ల‌కు న‌ర‌కం చూపిస్తోన్న PCB
Advertisement

PCB:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) తుది దశకు వచ్చింది. ఈ టోర్నమెంటులో ఇప్పటికే నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు దూసుకువెళ్ళాయి. టీమిండియా ( Team India), ఇంగ్లాండ్ ( England), సౌత్ ఆఫ్రికా అలాగే న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒక ప్లేయర్ 50 లక్షల రూపాయలు బోర్డుకు చెల్లించాల్సిందేనని పాకిస్తాన్ ప్లేయర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది PCB. జేబులో నుంచి ఈ డబ్బులు కట్టాలని స్పష్టం చేసిందని వార్తలు వస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో లీగ్ దశలో టీం ఇండియా చేతిలో ఓడిపోయినందుకు గాను ఈ చర్యలకు పూనుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్.

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

పాకిస్తాన్ ప్లేయర్లపై PCB యాక్షన్.. డబ్బులు కట్టాలని టార్చర్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీలంకను 147 పరుగుల లోపు కట్టడి చేయలేక చేతులెత్తేసిన పాకిస్తాన్… టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతలోనే పాకిస్తాన్ ప్లేయర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. లీగ్ దశలో ఇండియా చేతిలో ఓడిపోయినందుకు గాను… ఒక్కో పాకిస్తాన్ ప్లేయర్ బోర్డుకు 50 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఈ 50 లక్షలు పాకిస్తాన్ రూపాయలలో చెల్లించాలి. అంటే ఇండియన్ రూపాయలలో 16 లక్షలన్నమాట. త్వరలోనే ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ప్లేయర్లతో నిర్వహించనుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆ తర్వాత టి20 అలాగే వన్డేల నుంచి బాబర్ ఆజం ను ( Babar Azam) తొలగించబోతున్నారట. సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ కూడా పోనున్నట్లు సమాచారం. షాహిన్ అఫ్రిదిని కూడా టి20 జట్టులోంచి తొలగించేందుకు సిద్ధమయ్యారట. పాకిస్తాన్ టి20 కెప్టెన్ గా ఫర్హాన్ కు ( Farhan) అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరికొన్ని షాకింగ్ నిర్ణయాలు కూడా తీసుకునేందుకు కసరత్తులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొదలుపెట్టినట్లు సమాచారం.

Advertisement

ఇది ఇలా ఉండగా, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో లీక్ దశలో టీమ్ ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీమిండియా చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది పాకిస్తాన్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో విఫలమైంది. అయితే ఈ ఓటమిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ చర్యలకు పూనుకుందని అంటున్నారు.

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×