E-Paper
Advertisement

Vijay Rashmika Haldi: విజయ్ రష్మిక హాల్దీ… ఫోటోలను షేర్ చేసిన విజయ్!

Vijay Rashmika Haldi: విజయ్ రష్మిక హాల్దీ… ఫోటోలను షేర్ చేసిన విజయ్!
Advertisement

Vijay Rashmika Haldi: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి మరొక కొన్ని గంటలలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో అతిథులందరూ కూడా ఉదయ్ పూర్ చేరుకుంటున్నారు. విజయ్ రష్మిక ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 8 గంటలకు పెళ్లి చేసుకోబోతున్నారు. వీరు హిందూ సాంప్రదాయం ప్రకారం అలాగే కొడువు సాంప్రదాయ పద్ధతిలో కూడా వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట తమ పెళ్లి తేదీని అధికారకంగా ప్రకటించి ఉదయపూర్ చేరుకున్నారు. అక్కడ వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

విరోష్ హాల్దీ ఈవెంట్..

ఇప్పటికే వీరి సంగీత్ ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే నేడు హల్ది వేడుక కూడా అంతే ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలందరూ కూడా పసుపు రంగు దుస్తులలో కనిపించి సందడి చేశారు. పెళ్లికి వెళ్లిన అతిథులు వారి వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక సైతం వీరి హల్దికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

విజయ్, రుషీ పేర్లతో..

Advertisement

ఇక విజయ్ రష్మిక హల్దీ ఫోటోలను షేర్ చేసినప్పటికీ వీరిద్దరి ఫోటోలను ఎక్కడ షేర్ చేయలేదు. కేవలం హల్ది డెకరేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. వీరి హల్ది కోసం పింక్ ఎల్లో ఫ్లవర్స్ తో అందంగా అలంకరించారని తెలుస్తుంది అలాగే ఫ్లవర్స్ ప్లకార్డులపై విజయ్, రుషీ అనే పేర్లను కలిగే ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండ రష్మికను రుషి అని ముద్దుగా పిలుస్తారనే విషయం తెలిసిందే. ఇలా ఈ హల్దికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..

Advertisement

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రష్మిక విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫోటోలను ఇప్పటివరకు ఎక్కడ షేర్ చేయలేదు. ఫోటోలను పూర్తి గోప్యంగా ఉంచారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రష్మిక విజయ్ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆత్రుత అభిమానులలో ఉందని చెప్పాలి కానీ ఈ జంట మాత్రం తమ ప్రీ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలను ఎక్కడ షేర్ చేయకపోవడం గమనార్హం. ఇక విజయ్ దేవరకొండ రష్మిక గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకంలా ఈ జంట సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ రష్మిక విజయ్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. 26వ తేదీ వీరి పెళ్లి వేడుక జరగగా మార్చి నాలుగో తేదీ వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది.

Also Read: Vrushakarma Glimpse: నాగచైతన్య వృషకర్మ పై బిగ్ అప్డేట్ .. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×