Samantha: స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా తన వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాబోయే సినిమా మా ఇంటి బంగారం ప్రమోషన్స్ సందర్భంగా ఆమె తన భర్త, ఈ సినిమాకు సహ నిర్మాత అయిన రాజ్ నిడిమోరు..గురించి మనసు విప్పి మాట్లాడింది. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, కలిసి చేసే పనులపై సమంత చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, “మేమిద్దరం నిజంగా ఒక ఇరిటేటింగ్ కపుల్ లాంటివాళ్లమే. ఎందుకంటే ఏ పని చేసినా కలిసి చేస్తాం. పని, ట్రావెల్, వర్కౌట్… అన్నీ కలిసి చేస్తాం. ఒక్క రోజు కూడా దూరంగా ఉండటం నాకు చాలా కష్టం” అని చెప్పింది. తమ హనీమూన్ దశ ఎప్పుడో పూర్తయిందని, ఇప్పుడు అది కంటే ముందుకు వెళ్లిన బంధంలో ఉన్నామని వివరించింది.
భర్త తన పక్కన ఉండటం వల్ల తన నటనలో మరింత మెరుగుదల వచ్చిందని సమంత అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఆమె హాలీవుడ్ ఉదాహరణ ఇచ్చింది. “Leonardo DiCaprio వరుసగా Martin Scorseseతో సినిమాలు చేస్తూ ఎలా ఎదిగాడో, అలాగే రాజ్ నా పక్కన ఉండటం వల్ల నేను కూడా మంచి నటిగా మారుతున్నానని అనిపిస్తోంది” అని సమంత చెప్పింది.
అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు అభిమానులు సమంత మాటలను ప్రశంసించగా, మరికొందరు మాత్రం ఆమె పోలికను అతిశయంగా ఉందని ట్రోల్ చేశారు. “ఇది చాలా ఓవర్‌గా ఉంది” అంటూ కొన్ని కామెంట్లు వచ్చాయి. మరికొందరు మాత్రం సమంత ప్రేమ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది, అది ఆమె స్వభావం.. అని ఆమెకు మద్దతు తెలిపారు.
సమంత, రాజ్ నిడిమోరు ప్రేమకథ The Family Man 2 సెట్స్‌లో మొదలైంది. ఆ తర్వాత Citadel: Honey Bunny కోసం కలిసి పనిచేశారు. 2024లో పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపించడంతో వీరి బంధంపై చర్చ మొదలైంది. చివరకు గతేడాది డిసెంబర్‌లో కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు.
ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’తో ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. సమంత వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెండింటిలోనూ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిందని అభిమానులు భావిస్తున్నారు.
ALSO READ: Samantha: రాజమౌళి ఈగ సినిమాపై సమంత కామెంట్స్…సెకండ్ ఛాన్స్ వస్తే అంటూ!