E-Paper
Advertisement

Front Load Washing Machines: కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మార్చిలో రాబోయే.. అడ్వాన్స్డ్ ఫ్రంట్ లోడ్ వాషర్లు ఇవే!

Front Load Washing Machines: కొత్త వాషింగ్ మిషన్ కావాలా? మార్చిలో రాబోయే.. అడ్వాన్స్డ్ ఫ్రంట్ లోడ్ వాషర్లు ఇవే!

Front Load Washing Machines: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఇంట్లో వాషింగ్ మిషన్ తప్పనిసరిగా మారిపోయింది. పేద, మధ్య తరగతి, ధనిక అన్న తారతమ్యాలు లేకుండా తమ బడ్జెట్ పరిధిని బట్టి వాషింగ్ మిషన్లను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కంపెనీలు సైతం యూజర్ల అవసరానికి అనుగుణంగా అధునాతన ఫీచర్లతో వాషింగ్ మిషన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి చివరి నాటికి పలు లేటెస్ట్ మోడల్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వాటి ఫీచర్లను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

LG AI Direct Drive Series (2026)

ఎల్జీ కంపెనీకి చెందిన ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఏఐ ఫ్యాబ్రిక్ కేర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. బట్టల బరువు, వాటి సున్నితత్వం ఆధారంగా ఆటో సెట్టింగ్ చేసుకొని బట్టలను వాష్ చేస్తుంది. ఇందులోని టర్బో వాష్ 360 డిగ్రీ ఆప్షన్.. 30 నిమిషాల్లోనే బట్టలను వాష్ చేస్తుంది. స్టీమ్ + టెక్నాలజీ.. చర్మంపై అలర్జీలకు కారణమయ్యే క్రిమురు, బ్యాక్టీరియాలను తొలగిస్తుంది.

Samsung Bespoke AI Laundry Combo (2026 Edition)

ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లోని AI Ecobubble సాంకేతికత.. చల్లని నీటితోనూ మెరుగైన శుభ్రత అందిస్తుంది. స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా.. దీనిని కంట్రోల్ చేయవచ్చు. దీనిలోని ఎనర్జీ ఏఐ మోడ్.. విద్యుత్ అతి వినియోగాన్ని నివారిస్తుంది.

Bosch serie 8 front loader (New Launch)

ఈ వాషింగ్ మిషన్.. i-DOS Automatic Detergent Systemతో పనిచేస్తుంది. ఇందులోని 4D వాషింగ్ సిస్టమ్.. బట్టలను నాలుగు వైపుల నుంచి శుభ్రం చేస్తుంది. మెుండి మరకలను సమర్థవంతంగా వదిలిస్తుంది.

Whirlpool FreshCare+ Smart Washer (2026)

ఇందులోని FreshCare+ టెక్నాలజీ వాష్ తర్వాత బట్టల నుంచి వచ్చే దుర్వాసనను అరికడుతుంది. 6th Sense Technology బట్టల లోడింగ్ కు అనుగుణంగా రిన్స్ సైకిల్స్ ను దానంతట అదే అడ్జస్ట్ చేసుకుంటుంది.

Also Read: Apple OLED MacBook Pro: టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ వచ్చేస్తోంది.. యాపిల్ యూజర్ల కల నెరవేరబోతున్నట్టేనా?

IFB Senator Plus AI (2026 Model)

ఇది AI-powered wash optimizationతో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని Aqua Energie ఫీచర్.. కఠినమైన నీటిలోనూ బట్టలను సున్నితంగా ఉతికేలా చేస్తుంది. 3D వాష్ సిస్టమ్, హై స్పిన్ స్పీడ్, ఫాస్టర్ డ్రైయింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: Tata Punch EV Facelift: టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ చౌకైన వేరియంట్ వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×