Vijay Rashmika: 2026 న్యూ ఇయర్ మొదటి రోజే.. టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది. విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన న్యూ ఇయర్ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌లో ఆయన కొత్త ఏడాదికి స్వాగతం పలికిన.. ఆయన క్యాప్షన్ కన్నా కూడా ఆయన ఫోటోలు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఒక విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు అయింది. అదేమిటంటే ఈ పోస్టుతో.. విజయ్ తనకు రష్మిక తో పెళ్లి జరగనుంది అని.. ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇస్తున్నారు అన్న విషయం అందరికీ అర్థమయిపోయింది.
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఒకే సమయంలో ఒకే ప్రదేశాల్లో కనిపించడం, ఒకే తరహా ఫోటోలు షేర్ చేయడం వల్ల ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయినప్పటికీ.. వీరిద్దరూ ఈ విషయంపై మౌనం పాటిస్తూ వచ్చారు.
రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో ఆమె కెరీర్ మంచి దశలో ఉంది. సినిమాల బిజీలో ఉన్నా..ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాత్రం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా చర్చించుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా “రష్మిక పెళ్లి ఎప్పుడు?” అనే ప్రశ్న సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో రష్మిక పెళ్లి విజయ్ దేవరకొండతో..ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందనే వార్తలు కూడా వినిపించాయి. కొందరు రిపోర్ట్స్ ప్రకారం, పెళ్లి వేదికగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో రష్మిక రోమ్ వెకేషన్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆమెతో పాటు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కనిపించడంతో..ఇది పెళ్లికి ముందు వెకేషన్ అనే వార్తలు వైరల్ అయ్యాయి.
ఇక న్యూ ఇయర్ రోజున విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలు అసలు హాట్ టాపిక్ అయ్యాయి. రష్మిక వెళ్లిన అదే ప్రదేశాల్లో విజయ్ కూడా ఫోటోలు పెట్టడంతో.. అభిమానులు దీన్ని బ్యాచిలర్ పార్టీ ట్రిప్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు.
వీరిద్దరూ తమ తమ ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం చూసిన తర్వాత..అధికారిక ప్రకటన లేకపోయినా పెళ్లి ఖాయమనే నమ్మకం అభిమానుల్లో బలపడింది. దీంతో.. ఇక అధికారికంగా వీళ్ళు చెప్పే విషయమే మిగిలి ఉంది అని తెగ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందరూ.
ALSO READ: Rashmika Mandanna: న్యూఇయర్ వేళ స్పెషల్ పిక్ పంచుకున్న రష్మిక!