
608005298_18549986527045304_7905277750769688451_n
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్గా ఒకప్పుడు చలామణి అయిన ఈమె ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటూ అందరి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

608838977_18549986500045304_357924091191629341_n
గడిచిన ఏడాది రష్మికకు ఏ విధంగా అదృష్టాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా ఏకంగా ఐదు చిత్రాలను విడుదల చేసిన ఈమె ఈ ఐదు చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

609065100_18549986473045304_1752861312634553647_n
ఒకవైపు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. తాను ప్రేమించిన విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం కూడా చేసుకుంది.

608785133_18549986452045304_8944332014243798628_n
అలాగే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ కూడా చేసింది. అలా గడిచిన ఏడాది మొత్తం చాలా సంతోషంగా గడిపిన ఈమె.. అందుకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను కొత్త ఇయర్ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.

609791687_18549986518045304_4235956341796918286_n
అందులో ముఖ్యంగా ఒక స్పెషల్ ఫోటోని న్యూ ఇయర్ సందర్భంగా పంచుకోవడం మరింత వైరల్ గా మారుతోంది.

Rashmika Mandanna (Source: Instragram)
తన చిట్టి చెల్లెలుతో కలిసి దిగిన ఫోటోని రష్మిక షేర్ చేసుకోవడంతో ఇది కదా న్యూ ఇయర్ అసలైన ఫోటో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు